పెళ్ళింట విషాదం…

  చందుర్తి: పచ్చని తోరణాలు,భాజ,భజంత్రీల చప్పుళ్ళు, బంధువులతో కళకళలాడ్సిన పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లవారితే పెళ్ళి జరగాల్సిన ఇంట్లో తల్లి హఠన్మరణంతో విషాదచాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనను తలుచుకుంటూ బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సంఘటన చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ(42) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. బుధవారం ఉదయం 10.08 నిముషాలకు […]

 

చందుర్తి: పచ్చని తోరణాలు,భాజ,భజంత్రీల చప్పుళ్ళు, బంధువులతో కళకళలాడ్సిన పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లవారితే పెళ్ళి జరగాల్సిన ఇంట్లో తల్లి హఠన్మరణంతో విషాదచాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనను తలుచుకుంటూ బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సంఘటన చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ(42) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. బుధవారం ఉదయం 10.08 నిముషాలకు కుమారుడు ప్రశాంత్‌కు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన అలేఖ్యతో పెళ్ళి ఉంది. దీంతో ఆమె ఇంట్లో పనిచేస్తున్న సమయంలో కళ్ళు తిప్పుతున్నాయని పడుకుంది. అరగంట తర్వాత కుటుంబ సభ్యులు బూదవ్వను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మరణించింది. వివాహ పనుల్లో బిజిగా ఉన్న కుటుంబ సభ్యులను, బంధువులను ఈ సంఘటన విషాదంలో ముంచెత్తింది. తల్లి మరణవార్త తెలియగానే పెళ్లి కబురు చెప్పాల్సింది పోయి బంధువులకు చావు కబురు చెప్పాల్సి వచ్చిందంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడున్న వారందరిని కలిచి వేసింది. తల్లి బూదవ్వ మరణంతో పెళ్ళిళ్లలో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు ఆలుముకున్నాయి.

Comments

comments