టిప్పర్ ఢీకొని మహిళ మృతి

కొల్చారం: కన్నకూతుర్ని చూసేందుకు వెళ్లిన ఓ తల్లి రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి శివారులో హనుమాన్ బండల్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొల్చారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన రాహుల్ తల్లి వినోద తన కుమార్తె కొల్చారంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది. కాగా ఆదివారం కావడంతో కూతుర్ని కలిసేందుకు వస్తుండగా వెనుక నుండి టిఎస్ 35 9912 నెంబర్ గల […]

కొల్చారం: కన్నకూతుర్ని చూసేందుకు వెళ్లిన ఓ తల్లి రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి శివారులో హనుమాన్ బండల్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొల్చారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన రాహుల్ తల్లి వినోద తన కుమార్తె కొల్చారంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతుంది. కాగా ఆదివారం కావడంతో కూతుర్ని కలిసేందుకు వస్తుండగా వెనుక నుండి టిఎస్ 35 9912 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తున్న టిఎస్ యు బి 9286 నెంబరు గల టిప్పర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే వినోద మృతి చెందగా కుమారుడు రాహుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భర్త ఆది వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Stories: