చెట్టును నరికినందుకు మహిళకు రూ.17,000 జరిమానా

  హైదరాబాద్: చెట్టును నరికినందుకు ఒక మహిళకు రూ. 17,000 జరిమానా పడింది. ఎస్‌ఆర్ నగర్‌లోని శివ్‌భాగ్ కాలనీలో బాలికల హాస్టల్ నడుపుతున్న నాగమణి అనే మహిళ హాస్టల్ భవనం ముందున్న వృక్షాన్ని నరికివేయించింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆమెపై వాల్టా కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరస్తులకు విధించే జరిమానాలు వేర్వేరుగా ఉంటాయని జిల్లా అటవీ శాఖ అధికారి పి వెంకటేశ్వర్లు తెలిపారు. నేరానికి పాల్పడిన వ్యక్తి చదువుకోకపోవడం లేదా చట్టం […] The post చెట్టును నరికినందుకు మహిళకు రూ.17,000 జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: చెట్టును నరికినందుకు ఒక మహిళకు రూ. 17,000 జరిమానా పడింది. ఎస్‌ఆర్ నగర్‌లోని శివ్‌భాగ్ కాలనీలో బాలికల హాస్టల్ నడుపుతున్న నాగమణి అనే మహిళ హాస్టల్ భవనం ముందున్న వృక్షాన్ని నరికివేయించింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆమెపై వాల్టా కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరస్తులకు విధించే జరిమానాలు వేర్వేరుగా ఉంటాయని జిల్లా అటవీ శాఖ అధికారి పి వెంకటేశ్వర్లు తెలిపారు. నేరానికి పాల్పడిన వ్యక్తి చదువుకోకపోవడం లేదా చట్టం గురించి తెలియకపోయినట్లయితే జరిమానాలో కొంత మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో నాగమణి చదువుకున్న వ్యక్తి అయినందున ఆమెకు రూ. 17,000 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. చెట్ల నరికివేతకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కఠిన నిబంధనల గురించి ప్రజలకు అవగాహన తప్పనిసరని ఆయన తెలిపారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 4న సిద్దిపేటలో చెట్టు కొమ్మలు నరికినందుకు ఒక వ్యక్తికి హార్టికల్చర్ శాఖ అధికారులు రూ. 3,000 జరిమానా విధించారు.

 

Woman was fined Rs 17,000 for cutting tree, Nagamani, who runs a girls hostel in SR Nagar was fined by forest officials for cutting tree infront of her hostel building

The post చెట్టును నరికినందుకు మహిళకు రూ.17,000 జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: