ముక్క ముట్టని మొగడొద్దు…

హైదరాబాద్ : ముక్క తినని మొగడు తనకు ఒద్దంటూ రమ్య అనే వివాహిత పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. రఘు, రమ్య భార్యాభర్తలు. వీరికి ఆరు మాసాల క్రితమే పెళ్లి జరిగింది. రఘ కుటుంబం పూర్తి శాకాహార కుటుంబం, వారింట్లో మాంసం అనే మాటే వినబడదు. రమ్య నేపథ్యం మాత్రం వేరు. రమ్య ఇంట్లో మటన్, చికెన్ ఉండాల్సిందే. ఈ క్రమంలో తన భర్త రఘు మాంసం తినాలని రమ్య కోరింది. అయితే తాము మాంసం తినమని, పూర్తి […] The post ముక్క ముట్టని మొగడొద్దు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ముక్క తినని మొగడు తనకు ఒద్దంటూ రమ్య అనే వివాహిత పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. రఘు, రమ్య భార్యాభర్తలు. వీరికి ఆరు మాసాల క్రితమే పెళ్లి జరిగింది. రఘ కుటుంబం పూర్తి శాకాహార కుటుంబం, వారింట్లో మాంసం అనే మాటే వినబడదు. రమ్య నేపథ్యం మాత్రం వేరు. రమ్య ఇంట్లో మటన్, చికెన్ ఉండాల్సిందే. ఈ క్రమంలో తన భర్త రఘు మాంసం తినాలని రమ్య కోరింది. అయితే తాము మాంసం తినమని, పూర్తి శాకాహారులమని రఘు తేల్చి చెప్పాడు. దీంతో రమ్య జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్ధం కాక పోలీసులు అయోమయంలో పడిపోయారు. తన భర్త తన అలవాటును మార్చకుంటాడని ఆరు నెలలు చూశానని, పెళ్లికి ముందు రఘు శాకాహాారన్న విషయం తనకు తెలియదని రమ్య పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో రమ్య, రఘులకు పోలీసులు కౌన్సింగ్ ఇప్పించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. రమ్యకు మహిళా విభాగం చేత ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పించినా ఆమె మారలేదు. మాంసం కోసం భర్త వద్దన్న తొలి మహిళ రమ్యే కావచ్చన్న అభిప్రాయాన్ని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. రమ్యకు మహిళా విభాగం చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తామని, అయితే వారు ఒప్పుకోకపోతే, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు చెప్పారు.

Woman Wants Non Vegetarian Husband

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముక్క ముట్టని మొగడొద్దు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: