మహిళా టెక్కీ ప్రాణం తీసిన ఫేస్ బుక్ ప్రేమ…

హైదరాబాద్: ఫేస్ బుక్ ప్రేమ ఓ మహిళా టెక్కీ ప్రాణాలు తీసింది. ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో ప్రియుడిని కలవడానికి బెంగాల్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ప్రేమించివాడితో గొడవ పడి ఓ లాడ్జ్ లో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన నగరంలోని వనస్థలీపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… బెంగాల్ కి చెందిన సంగీత అనే మహిళ ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్ వేర్ […] The post మహిళా టెక్కీ ప్రాణం తీసిన ఫేస్ బుక్ ప్రేమ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఫేస్ బుక్ ప్రేమ ఓ మహిళా టెక్కీ ప్రాణాలు తీసింది. ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో ప్రియుడిని కలవడానికి బెంగాల్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ప్రేమించివాడితో గొడవ పడి ఓ లాడ్జ్ లో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన నగరంలోని వనస్థలీపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… బెంగాల్ కి చెందిన సంగీత అనే మహిళ ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫేస్ బుక్ ద్వారా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తన ప్రేమికుడి కోసం ఇటీవల సంగీత బెంగాల్ నుంచి నగరానికి వచ్చింది. గత మూడు రోజులుగా వనస్థలీపురం అభ్యుదయ నగర్ లోని ఓ లాడ్జ్ లో ఉంటుంది. ఆ లాడ్జిలో సంగీతతో పాటు లోకేష్ అనే ఓ యువకుడు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత సంగీత ఆ లాడ్జిలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది సమాచారంతో లాడ్జికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంగీతకు 48 ఏళ్లు, లోకేష్‌కు 28 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Woman Techie Dead in Hyderabad after Meet her FB Lover

The post మహిళా టెక్కీ ప్రాణం తీసిన ఫేస్ బుక్ ప్రేమ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: