6నెలల పసికందును అమ్ముకున్న తల్లి…

Woman-Sells-Babyనగరంలో అదృశ్యమైన బాలుడు

హైదరాబాద్: నిజామాబాద్‌లో అదృశ్యమైన బాలుడు సోమవారం సికింద్రాబాద్‌లో కన్పించాడు. బాలుడిని తీసుకువెళ్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండి తూలుతూ వెళ్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. నగరంలోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమాడి కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ యాచకురాలి దగ్గర ఉన్న ఆరు నెలల బాలుడిని చూసి తనకు దత్తత ఇస్తావా అని అడగగా, రూ.10వేలు ఇస్తే ఇస్తానని చెప్పింది. బేరమాడి రూ.4వేలు యాచకురాలికి ఇచ్చి బాలుడిని తీసుకుని నగరానికి వచ్చాడు.

జూబ్లీ బస్టాండ్‌లో బస్సు ఎక్కి బోయిన్‌పల్లి వచ్చాక మద్యం మత్తులో బస్సుదిగి అటుఇటు తచ్చాడుతుండగా అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు కుమారులు లేరని బాలుడిని పెంచుకునేందుకు తీసుకువచ్చానని తెలిపాడు. బాలుడిని శిశు విహార్‌కు తరలించిన పోలీసులు ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించారు.

Woman Sells Her Six Months Old Baby in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 6నెలల పసికందును అమ్ముకున్న తల్లి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.