48 గంటల నిరసన!

  ప్లాన్ లేకుండా డ్రైనేజీ ఔట్‌లెట్ ఎలా..? మా పరిస్థితి ఏంటంటూ మహిళ ఆందోళన ఇంజనీరింగ్ అధికారులను నిలధీత నిలిచిపోయిన పైపులైన్ పనులు మాదాపూర్ : తన ఇంటి ముందు డ్రైనేజీ ఔట్‌లెట్ ఎలా ఏర్పాటు చేస్తారు..? వర్షాలు కురుస్తున్నప్పుడు మురుగునీరు మా ఇంటిలోకి రాదా..? మా పరిస్థితి ఏంటి… అయినా జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాల్సిన పనులు… ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చేయడమేంటి…? అధికారులు ఈ పనులు ఆపాలి…ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేయా లి… తగిన చర్యలు […] The post 48 గంటల నిరసన! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్లాన్ లేకుండా డ్రైనేజీ ఔట్‌లెట్ ఎలా..?
మా పరిస్థితి ఏంటంటూ మహిళ ఆందోళన
ఇంజనీరింగ్ అధికారులను నిలధీత
నిలిచిపోయిన పైపులైన్ పనులు

మాదాపూర్ : తన ఇంటి ముందు డ్రైనేజీ ఔట్‌లెట్ ఎలా ఏర్పాటు చేస్తారు..? వర్షాలు కురుస్తున్నప్పుడు మురుగునీరు మా ఇంటిలోకి రాదా..? మా పరిస్థితి ఏంటి… అయినా జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాల్సిన పనులు… ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చేయడమేంటి…? అధికారులు ఈ పనులు ఆపాలి…ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేయా లి… తగిన చర్యలు తీసుకోవాలి…! అంటూ ఓ మహిళ నిరసనకు దిగారు. పనులు సాగకుండా పైపులపైనే అడ్డుగా పడుకున్నారు. దీంతో అక్కడ ప్రైవేట్ వ్యక్తులు చేపడుతున్న డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి.

జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారి శిరీష, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తుండగానే స్థానికులందరూ తమ కాలనీకి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై నిలధీశారు. ఒక్క మహిళ తన నిరసనతో స్థానికుల్లో చైతన్యం తీసుకు రావడంతో పాటు అధికారులను ప్రశ్నించేలా చేశారు. దీంతో అధికారులు మౌనంగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటన అత్యంత సంపన్నులు ఉండే మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో శనివారం

చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్ళితే…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్‌ప్లాట్స్ కాలనీలో 25 అడుగుల రోడ్‌లోని అ కాలనీ రోడ్‌కు సంబంధించిన 20 మంది ప్లాట్‌ల యజమానులు కలిసి సోంత డబ్బులతో తమ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్‌ల ఏర్పాటుకు రోడ్‌ను తవ్వారు. అయితే, ఆ కాలనీలో చివరకు ఉన్న తన ఇంటి వద్ద వరకు తీసుకువచ్చిన డ్రైనేజీ ఔట్‌లేట్ నిలిపివేశారు. దీంతో అక్కడే ఇల్లు ఉన్న చావా అరుణ అనే మహిళ తన ఇంటి ముందు ఔట్‌లెట్ వదలరాదని నిరసనకు దిగారు. గోకుల్‌ప్లాట్స్ కాలనీలొ ఏలాంటి అనుమతులు లేకుండ ఇష్టం వచ్చినట్లు భవనాలు నిర్మిస్తుంటే డ్రైనేజీ సమస్య ఎదురైతదన్నారు.

అందుకు సర్కిల్ 21 ఇంజనీరింగ్ అధికారుల అనుమతులు కూడ లేకుండా కాలనీ రోడ్‌లను ఇష్టం వచ్చినట్లు తవ్వి డ్రైనేజీ నిర్మిస్తే చివరకు ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటదన్నారు. డ్రైనేజీ పనులు నిర్మిస్తే కాలనీలో మొత్తం నిర్మాణం చేయాలి కాని తమ ఇంటి ముందునా పూర్తి చేసుకోని వేరే వారి ఇంటి ముందర వదిలేస్తే ఎలా ఉంటదన్నారు. వర్షకాలంలో వర్షం వస్తే మా పరిస్థితి ఎంటి అన్నారు. సర్కిల్ 21 ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు వచ్చే వరకు రోడ్ మధ్యలో తవ్వకాలు చేశారన్నారు. రోడ్ తవ్వకాలు చేస్తు, డ్రైనేజీ పైప్‌లైన్ పనులను అడ్డుకుంటున్నానని దౌర్జన్యలకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు నిలిపివేయాలని కాలనీ వాసులందరు కలిసి అధికారులను కొరారు.

Woman protest not to set up drainage outlet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 48 గంటల నిరసన! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: