కల్తీ కల్లు కల్లోలం

నవాబ్‌పేట్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించి కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. దీంతో వ్యాపార సంస్థ్ధలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో కల్లు, మద్యానికి బానిసైన ప్రజలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కల్లు వ్యాపారస్తులు కల్తీ కల్లును విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో కొందుర్గు మండలంలో కల్లుకు బానిసైన ఓ […] The post కల్తీ కల్లు కల్లోలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నవాబ్‌పేట్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించి కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు చేపట్టింది. దీంతో వ్యాపార సంస్థ్ధలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో కల్లు, మద్యానికి బానిసైన ప్రజలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కల్లు వ్యాపారస్తులు కల్తీ కల్లును విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో కొందుర్గు మండలంలో కల్లుకు బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదే క్రమంలో వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలానికి చించల్‌పేట్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం, కొత్తపల్లి గ్రామం నుంచి కల్లు తెచ్చుకుని విందు చేసుకున్నారు. విందు చేసుకున్న వారిలో కల్తీ కల్లు వికటించి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందగా 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వికారాబాద్‌లోని మిషన్ ఆసుపత్రిలో వీరందరూ చికిత్స పొందుతున్నారు. అధికారులు కల్తీ కల్లును అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విచ్చలవిడిగా కల్తీ కల్లును తయారు చేసి గ్రామాలకు రవాణా చేసి విక్రయిస్తూ లక్షలు గడిస్తున్న వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలపై పట్టింపు లేకుండా లాభార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు.

వ్యాపారులకు అధికారులు సైతం మద్దతు తెలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. కల్తీ కల్లును అరికట్టాల్సిన అబ్కారి అధికారులు కల్తీకల్లు తయారీపై ఎటువంటి దాడులు చేయకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కల్తీ కల్లు సేవించి మృత్యువాత పడ్డప్పటికీ అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కల్తీకల్లును నిరోధించలేని ఆబ్కారి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Woman dies after drinking kalthi kallu in rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కల్తీ కల్లు కల్లోలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: