అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద విషాదం

Metro-Station-Roof-Collapse
హైదరాబాద్: నగరంలోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి పడటంతో ఓ వివాహిత మృత్యువాత పడింది. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం వర్షం పడుతుండటంతో తడవకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ మెట్ల పక్కన ఆమె నిలబడింది. అదే సమయంలో ఒక్కసారిగా స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలిని కూకట్ పల్లికి చెందిన మౌనికగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మరణ వార్త విని ఆమె కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
woman died at ameerpet metro station

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద విషాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.