విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్‌జీ రిటైర్

కుమారుడు రిషద్‌కు బాధ్యతలు న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ పదవీవిరమణ చేయనున్నారు. విప్రో సంస్థను ఆయన స్థాపించారు. 53 ఏళ్లుగా ఆ కంపెనీ పురోగతికి ఎనలేని సేవలందించారు. ప్రేమ్‌జీ స్థానంలో ఆయన కుమారుడు రిషద్ రానున్నారు. జులై చివరి నుంచి విప్రో ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకోనున్నారని, దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని విప్రో తెలిపింది. పేర్కొంది. ప్రేమ్‌జీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని […] The post విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్‌జీ రిటైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కుమారుడు రిషద్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ పదవీవిరమణ చేయనున్నారు. విప్రో సంస్థను ఆయన స్థాపించారు. 53 ఏళ్లుగా ఆ కంపెనీ పురోగతికి ఎనలేని సేవలందించారు. ప్రేమ్‌జీ స్థానంలో ఆయన కుమారుడు రిషద్ రానున్నారు. జులై చివరి నుంచి విప్రో ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకోనున్నారని, దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని విప్రో తెలిపింది. పేర్కొంది. ప్రేమ్‌జీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కొత్త ఎండి, సిఇఒ బాధ్యతలను తిరిగి అబిదాలి నీముచ్ చేపట్టనున్నారు. 2019 జూలై 31 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ప్రయాణమని, భవిష్యత్తులో దాతృత్వ కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నానని అజీం ప్రేమ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. వాటాదారుల ప్రయోజనాలను కాపాడటంలో రిషద్ నేతృత్వంలోని విప్రో టీం ముందుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమపై విశ్వాసం ఉంచిన క్లయింట్లు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Wipro Executive chairman Premji retired

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్‌జీ రిటైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: