చలికాలం జరభద్రం

Winter protection

 

నేరడిగొండ : చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లటిగాలులు వీస్తున్నాయి. ఈ సీజన్‌లో ఉప్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులు శరీరంపై ప్రభావం చూపుతాయి. తేమశాతం తగ్గిపోవడంతో చర్మం రక్షణ శక్తి సన్నగిల్లుతుంది. మహిళలు,వృద్దులు, ఆస్తమా,నిమోనియా బాధితులు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. మూఖం కాంతిహీన ం అవుతుంది.అరికాళ్లు పగులుతాయి. అలాంటి వారు జాగింగ్ చేసే సమయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో మనం తెలుసుకుందాం

*మృధుత్వంకోసం కొన్ని నీటి చుక్కలు కలిపి డ్రై స్కిన్ ఉన్న వారు మూఖానికి రాసుకుంటే కాంతివంతంగా ఉంటుంది.ఆయిల్ స్కిన్ ఉన్న వారు తేనేలో నాలుగు చుక్కలు నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకుంటే మృధుత్వం సంతరించుకుంటుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో కొద్దిసేపు కాలి పాదాలు ఉంచాలి. తర్వాత కాలి పాదాలను శుభ్రంగా పోడిబట్టతో తుడిచి నాణ్యమైన క్రీమును రా యాలి. గోరువెచ్చని నీటీలో పాదాలను ఉం చడం వల్ల అలసట కూడా తగ్గుతుంది.
*జాగింగ్ చేసేవారు తెల్లవారుజామున 5 ను ంచి 6 గంటల్లో జాగింగ్ చేయవద్దు ,చెట్లు ఎ క్కువగా ఉన్న ప్రాంతం కాకుండా కాస్తా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో జాగింగ్ చేయాలి.*తలకు మంకీటోపీలు ధరించాలి.
*చెవుల్లో దూది పెట్టుకోవాలి.వాకింగ్ చేసే వారు షూ,సాక్స్ తప్పనిసరిగా వేసుకోవాలి.

*శీతలపానీయాలు తాగవద్దు.
* జాగింగ్ చేసి ఇంటికి రాగానే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి
*చలిగా ఉండే సమయంలో బయట తిరగవద్దు.
*నిద్ర లేవగానే చల్లటి ప్రదేశంలోకి వెళ్లవద్దు

* ఆస్తమా వచ్చే అవకాశమున్న వారు మం దులు ముందుగానే వేసుకోవాలి.
*జ్వరం,దగ్గుజలుబు వంటి సమస్యలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి
*తెల్లవారుజామున,సాయంత్రం,రాత్రి పూట స్నానం చేయవద్దు చల్లటి వాతవరణంలో జాగింగ్ చేయవద్దు
*శరీరం పూర్తిగా కవర్ అయ్యో విధంగా దుస్తు లు ధరించాలి .త్వరగా జీర్ణమయ్యో ఆహర పదార్థాలు ధరించాలి ,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి

*ప్రీజ్‌లో పెట్టిన ఆహరపదార్థాలు నీళ్లు తీసుకోవద్దు. *ఆస్తమా బాధితులకు కష్టకాలమే ఆస్తమా, శ్యాసకోశ వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టకాలమే కాస్త చలి తగిలితే ఊపిరి తీ సుకోవడంలో ఇబ్బంది పడుతారు. వీరికి డస్ట్ అలర్జీ ,స్కీన్ సమస్యలు ఉంటాయి. బాదితులు ముందుగానే మందులను వాడాలి ఆలస్యం చేస్తే నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది ఫలితంగా ఊపిరితిత్తుల్లోని పొరలు ఉబ్బి శ్వాస ఆ డడం కష్టంగా మారుతుంది.

Winter protection advice

The post చలికాలం జరభద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.