రెచ్చగొట్టం, రెచ్చగొడితే ఊరుకోం

Rajnath-Singh

 

రాజ్‌నాథ్ సింగ్

ఝారియా (జార్ఖండ్) : భారతదేశం ఏ దేశాన్నీ రెచ్చగొట్టలేదని, కానీ రెచ్చగొడితే ఎవరినీ లెక్కచేయదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం చెప్పారు. ఇక్కడ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన ‘ ఉగ్రవాద నిర్మూలనకు నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశ ప్రతిష్టను పటిష్టం చేశాయి. ప్రపంచంలో ఒక బలమైన దేశంగా రూపొందించాయన్నారు. ‘మన ఉద్దేశం స్పష్టం. మన విధానం స్పష్టం. రెచ్చగొట్టం. రెచ్చగొడితే ఊరుకోం’ అన్నారు.

పాకిస్థాన్‌తో స్నేహసంబంధాల్ని ఏర్పరుచుకునేందుకు గత బిజెపి చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ రక్షణమంత్రి ‘స్నేహ హస్తాన్ని అందించేందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పొరుగుదేశం పాకిస్థాన్‌కు వెళ్లారు. ఫలితం దక్కలేదు. పైగా కార్గిల్ యుద్ధం జరగాల్సి వచ్చింది’ అన్నారు. జీవితంలో స్నేహితులు మారవచ్చు కానీ, పొరుగువారు మారరని అటల్ జీ చెప్పేవారు అన్నారు రాజ్‌నాథ్. వేరే దేశాలమాదిరిగా పాకిస్థాన్ సంప్రదాయకంగా యుద్ధం చేయలేదని, భారత సేనలపై దాడి చేసేందుకు ఉగ్రవాదుల్ని పంపిస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు.

Will provide citizenship to persecuted minorities

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెచ్చగొట్టం, రెచ్చగొడితే ఊరుకోం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.