రద్దు చేసే ప్రసక్తే లేదు

  ఎథెన్స్: కరోనా సమస్య తీవ్రంగా ఉన్నా ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మాత్రం జరగదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఒక వేళ క్రీడలను తాత్కాలికంగా వాయిదా వేస్తామని, అంతేతప్ప మొత్తం మీద పోటీలను రద్దు చేయడం ఉండదని సమాఖ్య స్పష్టం చేసింది. ఇక, ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో పలు దేశాలు ఒలింపిక్స్ […] The post రద్దు చేసే ప్రసక్తే లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎథెన్స్: కరోనా సమస్య తీవ్రంగా ఉన్నా ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మాత్రం జరగదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఒక వేళ క్రీడలను తాత్కాలికంగా వాయిదా వేస్తామని, అంతేతప్ప మొత్తం మీద పోటీలను రద్దు చేయడం ఉండదని సమాఖ్య స్పష్టం చేసింది. ఇక, ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలు కూడా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కూడా క్రీడలను వాయిదా వేయాలని భావిస్తోంది. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ప్రశ్నార్థకంగా మాడడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. విశ్వ క్రీడలకు కోసం క్రీడాకారులు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి స్థితిలో క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ జరిగితే క్రీడాకారులకు కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి.

త్వరలోనే నిర్ణయం
కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఒలింపిక్స్ నుంచి పలు దేశాలు తప్పుకోవాలని నిర్ణయించాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాలు తమ అథ్లెట్లను టోక్యో ఒలింపిక్స్‌కు పంపేది లేదని స్పష్టం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ ప్రధాని షింజో అబె కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌ను నిర్వహించాలని భావించామని, అయితే క్రీడల కంటే పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. ఇలాంటి స్థితిలో పోటీలను వాయిదా వేయాల వద్దా అనే దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రీడాకారుల ప్రాణాలను పనంగా పెట్టి పోటీలను నిర్వహించాలనేది తమ ఉద్దేశం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో సభ్య దేశాలు, ఒలింపిక్స్ సమాఖ్యతో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Will not Postponed Tokyo Olympic 2020: IOC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రద్దు చేసే ప్రసక్తే లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: