భర్తకు తలకొరివి పెట్టిన భార్య!

Wife set a fire in husband's funeral

వరంగల్ అర్బన్: పిల్లలు లేకపోవడంతో భర్తకు భార్య తలకొరివి పెట్టిన హృదయవిదారకర సంఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జగన్నాథపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… స్థానికంగా నివాసముండే పెండ్యాల దుర్గయ్య (65) అనే వృద్ధుడు మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు గ్రామానికి సమీపంలో ఉన్న కాలువలో పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గయ్య చనిపోయాడు. అయితే, దుర్గయ్యకు సంతానం లేకపోవడంతో వృద్ధురాలైన భార్య ప్రమీల తలకొరివి పెట్టింది. భార్య అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యం అక్కడివారిని కలిచివేసింది.

Comments

comments