ప్రియుళ్లతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్

Wife

 

కరీంనగర్ : సమాజంలో భార్యా భర్తల బందానికి విలువ లేకుండా పోతుంది. ఓ భార్య తన ఇద్దరు ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణకు, కావేరి అనే యువతితో పెళ్లయింది. అయితే, కావేరి గురించి చుట్టుపక్కల వాళ్లు కొన్ని ఫిర్యాదులు చేసినా అతడు తన భార్య మీద నమ్మకంతో పట్టించుకోలేదు. ఈ క్రమంలో భార్య సెల్‌ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూసి అతడు షాక్‌‌కి గురయ్యాడు. తన ఇద్దరు ప్రియుళ్లతో బాగా సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి అతడు భార్యను ప్రశ్నించాడు. అయితే, తమ గుట్టు బయటపడిపోవడంతో కావేరి భర్తను అంతం చేయాలనుకుంది. అతడు నిద్రపోతున్న సమయంలో తన ఇద్దరు ప్రియుళ్లతో కలసి అతడి ముఖం మీద దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని ప్లాన్ వేశారు. అది అమలు చేసే క్రమంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని గోడ దూకి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత భార్యాబాధితుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు నిందితులు సమాన్విత్, గణేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.

Wife Planing to kill Husband with Boyfriends

The post ప్రియుళ్లతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.