ఇంట్లో ప్రియుడితో రాసలీలలు…భర్తపైనే హత్యాయత్నం

Murder attempt

 

రంగారెడ్డి: భార్య ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన రంగరెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామానికి చెందిన సాయిలుకు మంజులతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది వీరు బతుకు దేరువు నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి బాలానగర్‌లో నివాసముంటూ బుట్టలు అల్లుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంజులకు నల్గొండ జిల్లా డిండికి చెందిన మేకల మధుకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇదిలా ఉండగా భర్త పని కోసం బయటకు వెళ్లితే భార్య మాత్రం పరాయి మగాడితో రాసలీలలు సాగిస్తుండగా చూసిన భర్త ఆగ్రహంతో భార్యను, తన ప్రియుడిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కాని భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపాలని చూసింది. వారి బారి నుంచి తప్పించుకున్న సాయిలు స్థానికులు సహయంతో కడ్తాల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకునే లోపే నిందితులిద్దరు గ్రామం నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సాయిలును చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సాయిలు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంజుల, మధుకర్‌రెడ్డి కోసం గాలించి అరెస్ట్ చేశారు.

Wife murder attempt on husband with lover in rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంట్లో ప్రియుడితో రాసలీలలు… భర్తపైనే హత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.