భర్తపై భార్య దాడి…

హైదరాబాద్: భర్తపై భార్యతో సహా వారి కుటుంబం గాజు పెంకులతో దాడిచేసిన ఘటన నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…  పాతబస్తీకి చెందిన వీరభద్రయ్యకు కందుకూరుకు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావాడానికి కందుకూరు వెళ్లిన వీరభద్రయ్యను తన బామ్మర్ది పని మీద ఇబ్రహీంపట్నం తీసుకెళ్లాడు. ఇదే అదనుగా తీసుకున్న భార్య పాతబస్తీలోని తన […] The post భర్తపై భార్య దాడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: భర్తపై భార్యతో సహా వారి కుటుంబం గాజు పెంకులతో దాడిచేసిన ఘటన నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…  పాతబస్తీకి చెందిన వీరభద్రయ్యకు కందుకూరుకు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావాడానికి కందుకూరు వెళ్లిన వీరభద్రయ్యను తన బామ్మర్ది పని మీద ఇబ్రహీంపట్నం తీసుకెళ్లాడు.
ఇదే అదనుగా తీసుకున్న భార్య పాతబస్తీలోని తన ఇంటికి వెళ్లి బీరువాలోని నగలు, నగదు ఎత్తుకుపోయింది. అనుమానం వచ్చిన భర్త, భార్యను నిలదీశాడు. దీంతో తనపై కుటుంబ సభ్యులతో కలిసి గాజు పెంకులతో దాడి చేసిందంటూ వీరభద్రయ్య పోలీస్ స్టేషన్ లో తన బావమరుదులు సంగమేష్, విశ్వనాథం, అత్త ప్రభావతి, భార్య సంధ్యలపై కందుకూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన  న్యాయం చేయకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంన్నారని బాధితుడు తీవ్రంగా అరోపిస్తున్నాడు.
wife attack on husband in old city Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భర్తపై భార్య దాడి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: