బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేదు: ఎర్రబెల్లి

Why corona spread in BJP ruling states

 

జనగామ: కరోనాపై తెలంగాణ బిజెపి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షంగా ఉందనడం అవాస్తవమన్నారు. కరోనా కష్ట కాలంలో రైతులు ఇబ్బంది పడొద్దని రైతు బంధుతో సిఎం కెసిఆర్ ఆదుకుంటున్నారని కొనియాడారు. కోడకండ్లలో 25 కోట్లతో గోదాము నిర్మించబోతున్నామని హామీ ఇచ్చారు. కరోనా విషయం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

The post బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేదు: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.