చైనాకు కొమ్ముకాస్తోంది

  కరోనా పట్ల డబ్లుహెచ్‌ఓ తీరుపై ట్రంప్ ధ్వజం వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)తీరును ఆమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. కరోనా విషయంలో డబ్లుహెచ్‌ఓ చైనాను వెనకేసుకు వస్తోందని.. ఇది నిజంగా విచారించదగ్గ విషయమని ఆయన అన్నారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలి సారిగా ప్రాణాంతక కరోనా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ హమ్మారి పుట్టుకకు చైనీయుల ఆహారపు […] The post చైనాకు కొమ్ముకాస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా పట్ల డబ్లుహెచ్‌ఓ తీరుపై ట్రంప్ ధ్వజం

వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)తీరును ఆమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. కరోనా విషయంలో డబ్లుహెచ్‌ఓ చైనాను వెనకేసుకు వస్తోందని.. ఇది నిజంగా విచారించదగ్గ విషయమని ఆయన అన్నారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలి సారిగా ప్రాణాంతక కరోనా వైరస్ బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ హమ్మారి పుట్టుకకు చైనీయుల ఆహారపు అలవ ట్లూ కారణమంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తా యి. ఇక అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వ్యాప్తికి చైనాయే కారణమంటూ విమర్శలు గుప్పించింది. కరోనాను చైనా వైరస్ అంటూ ట్రంప్ మాటల యుద్ధానికి తెరదీశారు. ఈ క్రమంలో చైనా సైతం అమెరికాకు గట్టిగానే సమాధానమిచ్చింది. అమెరికా సైనికులే ఈ వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చారంటూ ఘాటుగా ఎదురుదాడికి దిగింది.

ఈనేపథ్యంలో గత జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌అధనోమ్ ఘెబ్రేయేసెస్ చైనాలో పర్యటించిన విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్ మాక్రో రుబియో, కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ మెకాల్ తాజాగా విమర్శలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా అద్భుతంగా కృషి చేసిందని టెడ్రోస్ ప్రశంసించడాన్ని వారు తప్పుబట్టారు. చైనాతో ఉన్న పాత సంబంధాల కారణంగానే ఆయన ఆ దేశాన్ని పొగుడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. మరో సెనేటర్ జోష్ హావ్లే సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘ఇందుకు సంబంధించి ఆయన విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్రపంచానికి వ్యతిరేకంగా డబ్లుహెచ్‌ఓ చైనా కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలిచింది’అంటూ అక్కసు వెళ్లగక్కారు. ఇదే విధంగా చైనాతో కలిసి కరోనా విషయంలో కుట్ర పన్నారని పలువురు నేతలు ఆరోపణలకు దిగారు. ఈ విషయంగురించి బుధవారం శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో విలేఖరులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ, ‘డబ్లుహెచ్‌ఓ చైనాకు చాలా మద్దతుగా నిలుస్తోంది. ఈ విషయంలో చా లా మంది అసంతృప్త్తితో ఉన్నారు’ అని అన్నారు. కాగా కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా బుధవారం నాటికి 21,293 మంది మృత్యువాత పడగా, 4,71,518 మందికి ఈ వైరస్ సోకినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

WHO very much sided with China on co
ona, says Trump

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చైనాకు కొమ్ముకాస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: