ఇబుప్రొఫెన్ వద్దు.. పారాసిటమాల్ బెటర్: డబ్ల్యుహెచ్‌ఓ

జెనీవా: కోవిడ్ 19(కరోనా వైరస్) లక్షణాలతో బాధపడేవారు ఎట్టిపరిస్థితిలో సొంత వైద్యం చేసుకోరాదని, ఇబుప్రొఫెన్ వంటి మాత్రలను వేసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరించింది. ఇబుప్రొఫెన్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు తీసుకోవడం వల్ల ఏర్పడే ఎంజైమ్ కోవిడ్-19 లక్షణాల తీవ్రతను మరింత పెంచుతుందని ఇటీవల ది లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం అభిప్రాయపడింది. ఇదే విషయమై ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఓలీవియర్ వెరాన్ కూడా ఇబుప్రొఫెన్ వాడకంపై ప్రజలకు హెచ్చరించారు. ఈ అధ్యయనం […] The post ఇబుప్రొఫెన్ వద్దు.. పారాసిటమాల్ బెటర్: డబ్ల్యుహెచ్‌ఓ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జెనీవా: కోవిడ్ 19(కరోనా వైరస్) లక్షణాలతో బాధపడేవారు ఎట్టిపరిస్థితిలో సొంత వైద్యం చేసుకోరాదని, ఇబుప్రొఫెన్ వంటి మాత్రలను వేసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరించింది. ఇబుప్రొఫెన్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు తీసుకోవడం వల్ల ఏర్పడే ఎంజైమ్ కోవిడ్-19 లక్షణాల తీవ్రతను మరింత పెంచుతుందని ఇటీవల ది లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం అభిప్రాయపడింది. ఇదే విషయమై ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఓలీవియర్ వెరాన్ కూడా ఇబుప్రొఫెన్ వాడకంపై ప్రజలకు హెచ్చరించారు. ఈ అధ్యయనం గురించి డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండమేయర్‌ను విలేకరులు ప్రశ్నించగా ఈ నివేదికను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

అయితే..తాత్కాలిక ఉపశమనం కోసం మందులు వేసుకునేవారు ఇబుప్రొఫెన్ బదులు పారాసిటమాల్ వాడవచ్చని తాము సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు. పారాసిటమాల్‌ను కూడా కచ్ఛితమైన డోసేజ్ ప్రకారమే వేసుకోవాలని, ఎక్కువ డోసేజ్ వేసుకుంటే అది కాలేయానికి హానికరమని ఆయన చెప్పారు. కోవిడ్-19 లక్షణాలతో బాధపడేవారు సొంత వైద్యం పూర్తిగా మానుకోవాలని, జ్వరం వరకు పారాసిటమాల్ వాడవచ్చని ఆయన సూచించారు.

 

WHO asks not to use Ibuprofen for COVID-19, WHO advises to use Paracetamal for corona virus like symptoms

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇబుప్రొఫెన్ వద్దు.. పారాసిటమాల్ బెటర్: డబ్ల్యుహెచ్‌ఓ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: