వద్దనుకుంటే గ్రూప్‌లు నో.. వాట్సాప్ యూజర్లకు ఆప్షన్స్…

న్యూఢిల్లీ: వచ్చి పడే వాట్సాప్ గ్రూప్‌లకు సంబంధించి యూజర్స్‌కు మరింత నియంత్రణను వాట్సాప్ సంస్థ కల్పించింది. కొత్త గ్రూప్‌లలో చేరవచ్చా? లేదా అనేది వాట్పాస్ వినియోగదారులు నిర్ణయించుకోవచ్చునని, అనవసరం అనుకుంటే వాటిని తిరస్కరించేందుకు కూడా స్వేచ్ఛను కల్పించారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ తక్షణ సందేశాల వేదిక వాట్సాప్ చర్య కీలకంగా మారింది. రాజకీయ పార్టీల ప్రచార ఘట్టంలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఇప్పుడు వాట్సాప్ కీలక పాత్ర గణనీయంగా మారింది. పలు రకాల […] The post వద్దనుకుంటే గ్రూప్‌లు నో.. వాట్సాప్ యూజర్లకు ఆప్షన్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: వచ్చి పడే వాట్సాప్ గ్రూప్‌లకు సంబంధించి యూజర్స్‌కు మరింత నియంత్రణను వాట్సాప్ సంస్థ కల్పించింది. కొత్త గ్రూప్‌లలో చేరవచ్చా? లేదా అనేది వాట్పాస్ వినియోగదారులు నిర్ణయించుకోవచ్చునని, అనవసరం అనుకుంటే వాటిని తిరస్కరించేందుకు కూడా స్వేచ్ఛను కల్పించారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ తక్షణ సందేశాల వేదిక వాట్సాప్ చర్య కీలకంగా మారింది. రాజకీయ పార్టీల ప్రచార ఘట్టంలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఇప్పుడు వాట్సాప్ కీలక పాత్ర గణనీయంగా మారింది. పలు రకాల వాట్సాప్ గ్రూప్‌లు యుజర్స్ అంగీకారాలతో ప్రమేయం లేకుండా వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ విధంగా వచ్చిచేరుతున్న వాటిలో దేనినైనా వద్దనుకుని, వాటిని తొలిగించుకునే నియంత్రణ అధికారాన్ని యుజర్లకు అప్పగిస్టున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం నుంచే వెలువడుతోన్న వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.

తమకు తెలియకుండా వచ్చిపడే వాట్సాప్ గ్రూప్‌లను తొలిగించుకోవాలంటే యుజర్లు సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి, అందులో ఉండే నోబడి , మై కాంటాక్టు, ఎవ్రీ ఒన్ అనే వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఇందులో నోబడిని ఎంచుకుంటే వాట్సాప్ గ్రూప్‌ల నిర్వాహకులు సదరు యుజర్ అనుమతి తరువాతనే ఎంటర్ కావడానికి వీలుంటుంది. ఇక మై కాంటాక్టు ఎంచుకుంటే సదరు యుజర్స్ వాట్సాప్ గ్రూప్‌లకు అభ్యంతరం చెప్పడం లేదని భావించుకోవచ్చు. ఇక ఎవ్రీ వన్‌ను ఎంచుకుంటే ఏ గ్రూప్ అయినా తమకు అభ్యంతరం లేదని అంగీకరించినట్లుగా భావించుకోవచ్చు. ఎన్నికల సమయంలో తమ వాట్సాప్‌ను రాజకీయ పార్టీలు ప్రచార వేదికగా అక్రమంగా వాడుకోకుండా చేసేందుకు, ప్రత్యేకించి కొన్ని నిర్థిష్ట అంశాలతో తమ వినియోగదారుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు వాట్సాప్ ఇప్పుడు ఈ చర్యలకు దిగింది.

WhatsApp Users Can Decide Who Adds Them To Groups

The post వద్దనుకుంటే గ్రూప్‌లు నో.. వాట్సాప్ యూజర్లకు ఆప్షన్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: