ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మమత ర్యాలీ

CM Mamataకోల్ కత్తా: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్‌ఆర్‌సి(జాతీయ పౌరుల గణన)ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ సిఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ తీశారు.  అస్సాంలో కేంద్రం నిర్వహించిన ఎన్‌ఆర్‌సిలో 19 లక్షల మందికి జాబితాలో చోటు దక్కలేదని మమత పేర్కొన్నారు. జాబితాలో చోటు దక్కనివారిలో  అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు  ఉన్నారని ఆమె తెలిపారు. ఇప్పటికిప్పుడు వారు దేశాన్ని విడిచి వెళ్లాలంటే, ఎలా సాధ్యమని మమత కేంద్రాన్ని నిలదీశారు. 76 ఏళ్ల స్వతంత్ర్య భారత్ లో జాతీయతను నిరూపించుకోవాలని చెప్పడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాంలో మాదిరిగా పోలీసు బలగాలతో పశ్చిమబెంగాల్ ప్రజలను బెదిరించలేరని ఆమె స్పష్టం చేశారు. అన్ని పండుగల గురించి తమకు తెలుసనని, బిజెపి నేతలు చెప్పాల్సిన అవసరం ఆమె తేల్చి చెప్పారు.

West Bengal CM Mamata Rally Against NRC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మమత ర్యాలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.