వందేళ్ల పాటు తిరగులేని శక్తిగా టిఆర్‌ఎస్ పార్టీ…

  సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్ పార్టీని దేశంలో అగ్రగామిగా నిలుపుతాయి విజయదశమి లోపు జిల్లా కార్యాలయాల ప్రారంభం ఈనెల 5నుండి బస్తీబాట కార్యక్రమం నేడు ఎంఎల్‌సికి ఘన సన్మానం సుబేదారి : 2001 ఎప్రిల్ 27న త్యాగాల పునాదులపై స్థాపించిన టిఆర్‌ఎస్ పార్టీని ఆనాడు ఒకే ఒక్కడుగా బయలుదేరినటువంటి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా అనేక త్యాగాలు చేసి చివరకు తన ప్రాణత్యాగానికి సైతం సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్ […] The post వందేళ్ల పాటు తిరగులేని శక్తిగా టిఆర్‌ఎస్ పార్టీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్ పార్టీని దేశంలో అగ్రగామిగా నిలుపుతాయి
విజయదశమి లోపు జిల్లా కార్యాలయాల ప్రారంభం
ఈనెల 5నుండి బస్తీబాట కార్యక్రమం
నేడు ఎంఎల్‌సికి ఘన సన్మానం

సుబేదారి : 2001 ఎప్రిల్ 27న త్యాగాల పునాదులపై స్థాపించిన టిఆర్‌ఎస్ పార్టీని ఆనాడు ఒకే ఒక్కడుగా బయలుదేరినటువంటి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్షంగా అనేక త్యాగాలు చేసి చివరకు తన ప్రాణత్యాగానికి సైతం సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం బాలసముద్రంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు ఒక వైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఒక కెసిఆర్ కే చెల్లుతుందన్నారు.

నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల తో కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వెళ్లి అర్హులైన ప్రజలకు సంక్షేమ ప థకాలు అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులుగా టిఆర్‌ఎ స్ పార్టీని బలోపేతం చేయడానికి దేశంలో ఉన్న అన్నిరాజకీయ పార్టీలకు ధీ టుగా వందేళ్ల పాటు టిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుందన్నా రు. అందులో భాగంగా టిఆర్‌ఎస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాలానుసారం కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జిలా కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. దసరా లోపు జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తామన్నారు. జిల్లా కార్యాలయాన్ని ప్రజాప్రతినిధులు, మంత్రు లు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు సర్పంచ్‌లకు పార్టీ తరపున అన్ని కార్యక్రమాలను జిల్లా కార్యాలయాల్లో నిర్వహించేందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం చేప ట్టే వివిధ కార్యక్రమాలకు పార్టీ తరపున టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరంతరం కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యాలయాల నిర్మాణం కోసం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పార్టీ నిధుల నుండి రూ.65 లక్షలను ఇప్పించడం జరిగిందన్నారు. పార్టీ విస్తృతస్థాయి స మావేశాలు, కార్యక్రమాలు పార్టీ సభ్యత్వంపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా కెటిఆర్‌తో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో ఆదివారం సమావేశం కానున్నారని తెలిపారు.

నేడు అభిరాంగార్డెన్స్‌లో టిఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని కార్పొరేషన్ చైర్మన్‌లు, బూత్ క మిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు, కార్యకర్తలు, 2500ల మం ది బూత్ కమిటీలో ఉన్నారని మూడువేల మందితో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఐదు డివిజన్లకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తామన్నారు. పార్టీ ఉ ద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తలపై కేసులను ఎత్తివేస్తామన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు నూతన ప్రక్రియ మొదటగా పశ్చిమ నియోజకవర్గం నుండే ప్రా రంభిస్తామన్నారు.

ఈనెల 5 నుండి బస్తీ బాట కార్యక్రమం..
జులై 5వ తేదీ నుండి 15 వరకు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బస్తీబాట కార్యక్రమం నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు టిఆర్‌ఎస్ కార్యకర్తల ఇంటింటికి వెళ్లి సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు మె రుగైన వైద్యసేవలు అందించేందుకు వారిని ఆర్థికంగా, ప్రభుత్వపరంగా వేల మందికి సిఎం రిలీఫ్ ఫండ్‌ను అందించామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 60 వేల మంది ప్రభుత్వ పథకాలను లబ్ధిపొందారన్నారు. ప్రతి డివిజన్‌కు మూడు వేల చొప్పున సభ్యత్వాలు నమోదు చేయిస్తామన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా ఒక కమిటీని ఏ ర్పాటు చేస్తామన్నారు.

నేడు ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి సన్మానం
అభిరాంగార్డెన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం జరగనుంది. దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఎంఎల్‌సిగా గెలుపొందిన ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి సమావేశం అనంతరం సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డిప్యూటి మేయర్ సిరాజుద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు అరుణశివకుమార్, టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Welfare schemes keep TRS Party at forefront of Country

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వందేళ్ల పాటు తిరగులేని శక్తిగా టిఆర్‌ఎస్ పార్టీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.