వానాకాలం హాయిగా…

Rain

 

ఈ కాలంలో బయట పనులు చేసుకునేవారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించే వర్షాన్ని స్వాగతిస్తాం. దాంతోపాటు బయటకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అందువల్లే మహిళలు ఎప్పుడూ బ్యాగ్‌లో గొడుగు ఉంచుకోవాలి. బండి మీద తిరిగేవారు రెయిన్ కోట్ ఒకటి పెట్టుకుంటే మంచిది.

ఈ కాలంలో ముఖ్యంగా దుస్తులపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటివి వేసుకోవాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా నగరాల్లో వర్షాలు పెద్దగా కురిస్తే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవడం, వర్షంలో తడిసిపోవడం, దుస్తులపై మరకలు ఏర్పడటం లాంటి ఇబ్బందిని కలిగిస్తాయి. వీటి నుండి తప్పించుకోలేమని తెలిసినా, ఈ సీజన్‌లో కాలానికి అనుగుణంగా దుస్తులు వేసుకుని అవస్థలు పడకుండా ఉండొచ్చు.

జీన్స్ జోలికి పోవద్దు ఈ కాలంలో వీటిని ధరించకపోవడమే మంచిది. జీన్స్ వేసుకుని వర్షంలో తడిస్తే చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి ఎక్కువ మోతాదులో నీళ్లను పీల్చుకుంటాయి. తొందరగా ఆరవు కూడా. ఆరడానికి కనీసం ఒక రోజు పడుతుంది. తర్వాత ఇంతగా తడిసిపోయిన దుస్తులను వేసుకుంటే ఆఫీసుల్లో మెలగడం బాగుండదు. ఫంగల్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ బాధించే అవకాశం కూడా ఉంది.

ఇబ్బంది పెట్టని దుస్తులు క్యాప్రీజ్, షార్ట్, స్కర్ట్ ఈ సీజన్‌లో చాలా బెస్ట్. ఇవి కేవలం కూల్, రెస్ట్ ఇవ్వడమే కాకుండా వర్షంలో చిక్కుకున్నా పెద్దగా ఇబ్బంది పెట్టవు. క్యాప్రీ శరీరాన్ని అతుక్కోకుండా అంతగా టైట్‌గా ఉండకుం డా చూసుకోవాలి. వదులుగా ఉంటే తొందరగా ఆరుతుంది. షార్ట్ కూడా ఇలా గే వానలో రోడ్డుపై నడుస్తున్నప్పుడు వాన తుంపర మరకలు పడనీయదు.
గాఢమైన, మెరిసిపోయే రంగులు ధరించే కాలమిది. లైట్ లెగ్గింగ్ లేదా కేప్రీతో పాటు ధరించొచ్చు. డార్క్ కలర్ అంటే నేవీ బ్లూ లేదా డార్క్ గ్రీన్ లాంటివి వార్డ్ రోబ్‌లో చేర్చుకోవాలి.

వదులుగా, తేలికగా ఉండే టాప్ రోజూ వేసుకోవడానికి షార్ట్ కుర్తీ, రూమీ టాప్, కర్లీ టీషర్టు బాగుంటాయి. ఫ్యాబ్రిక్ కూడా తేలికైనది ఎంచుకోవాలి. లైక్రా లేదా పాలియెస్టర్ రింకిల్ ఫ్రీ తేలికగా ఉంటాయి. కాటన్‌తో పోలిస్తే ఇవే తొందరగా ఆరిపోతాయి.
ఫార్మల్ షర్ట్ ఈ సీజన్‌లో విశ్రాంతిని కలిగించే తేలికగా ఉండే హాఫ్ స్లీవ్ ఫార్మల్ షర్ట్ హాయిగా ఉంటుంది. ఆఫీసు లుక్ కోసం పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఆఫీసులో టీషర్ట్ వేసుకోలేకపోతే వారికి హాఫ్ స్లీవ్ ఫార్మల్ షర్ట్ ప్రత్యామ్నాయం.

ట్రాన్స్‌పరెంట్ దుస్తులకు ‘నో’ ఒకవేళ ట్రాన్స్‌పరెంట్ టాప్ లేదా కుర్తా వేసుకుంటే వర్షంలో మిమ్మల్ని మీరు సిగ్గుపడేలా చేస్తుంది. వర్షంలో ఎప్పుడూ సాలిడ్, డార్క్ కలర్ టాప్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సాలిడ్ డ్రెస్ మెటీరియల్ వేసుకోవడంలో మరొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. వర్షంలో తడిసిపోతే దుస్తులు తొందరగా ఆరిపోతాయి. తర్వాత అండర్ షర్ట్ వేసుకునే అవసరం కూడా ఉండదు.

వార్డ్ రోబ్‌లో లైట్ విండ్ చీటర్స్ పెట్టండి మీ బ్యాగులో ఎప్పు డూ ఒక ఆల్ట్రా లైట్ విండ్ చీటర్ వెంట తీసుకువెళ్లాలి. వర్షంలో మీరు వాటిని వెంటనే వేసుకోవచ్చు. దీంతో దుస్తులను వాన తుంపర నుండి, రోడ్డుపై ప్రయాణించే వాహనాల కారణంగా మీద పడే బురద నుండి కూడా రక్షించుకోవచ్చు. అకస్మాత్తుగా చలి అనిపిస్తే ఇది శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

హాయిని గొలిపే ఫుట్‌వేర్ రోడ్డుపైన జారకుండా, రోడ్డుపైన బురద మీద పడకుండా ఉండడానికి హాయిని కలిగించే చెప్పులు ధరించడం ఈ కాలంలో చాలా అవసరం. వాటర్ ప్రూఫ్ లెదర్ స్లిప్ ఆన్స్ లేదా స్నీకర్స్ ఈ సీజన్‌కి బాగుంటాయి. సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి వర్షం నుండి రక్షిస్తాయి. తొందరగా చెడిపోవు కూడా. కొంతకాలం ఫార్మల్ షూల జోలికెళ్లొ ద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తూంటే వానాకాలాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.

Welcome to Rain that brings Relief from Heat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వానాకాలం హాయిగా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.