ఇవి తింటే బరువు పెరగరట..?

  మామూలుగా ఏవి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ బరువును తగ్గించే ఆహారపదార్థాలేమిటన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఆరు రకాల ఆహారాల వల్ల బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారట! దీనిలోని ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని గింజలు తిన్నా కడుపు నిండిన […] The post ఇవి తింటే బరువు పెరగరట..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మామూలుగా ఏవి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ బరువును తగ్గించే ఆహారపదార్థాలేమిటన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఆరు రకాల ఆహారాల వల్ల బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారట! దీనిలోని ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని గింజలు తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలిగి ఆహారం తీసుకోవలన్న కోరిక నశిస్తుందట! ఇక ఆహారపదార్థాల తయారీకి ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిదని వారు చెబుతున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే లేదు.

చేపల్లో కొవ్వు ఉండదు. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మాంసాల జోలికి పోకుండా వీలైనంత ఎక్కువగా చేపలు తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగూ ఉంటుంది, బరువూ పెరగరు. పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. వెజిటేబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం ముందు వాటిని తాగితే కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినం.

Weight loss Foods

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇవి తింటే బరువు పెరగరట..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.