ఇవి తింటే బరువు తగ్గొచ్చు…

Nuts

 

బరువు తగ్గాలంటే వాకింగ్‌లు, జాగింగ్‌లు చేస్తుంటారు. తక్కువగా తింటూ బరువు తగ్గుదామని కఠినమైన డైట్‌లు ప్లాన్ కూడా చేస్తారు. కానీ వీటితో పాటు సరైన పోషకాహారం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతాయని చెబుతున్నారు.

మినప్పప్పు: మినప్పప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. ఈ పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి.

సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి.

మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.

తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కా ర్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఉంటాయి.

ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Weight control with Nuts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇవి తింటే బరువు తగ్గొచ్చు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.