బరువును అదుపులో ఉంచే ఆహారం…

  ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఏమేం తినాలి. ఎలాంటి వ్యాయామాలు చేస్తే బరువు తగ్గుతామంటూ పుస్తకాలు తిరగేయడం, ఇంటర్‌నెట్‌లో వెతకడం, ఎవరు ఏ సలహా చెప్పినా పాటించేయడం చేస్తుంటాం. బరువు పెరగకుండా ఉండాలంటే ప్రొటీన్లు, ఫైబర్‌తో కూడిన తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. బరువు తగ్గడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు. కొంచెం పట్టుదల ఉంటే తగ్గడం చాలా సులువు. బాగా ఆకలేసినపుడు […] The post బరువును అదుపులో ఉంచే ఆహారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఏమేం తినాలి. ఎలాంటి వ్యాయామాలు చేస్తే బరువు తగ్గుతామంటూ పుస్తకాలు తిరగేయడం, ఇంటర్‌నెట్‌లో వెతకడం, ఎవరు ఏ సలహా చెప్పినా పాటించేయడం చేస్తుంటాం. బరువు పెరగకుండా ఉండాలంటే ప్రొటీన్లు, ఫైబర్‌తో కూడిన తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. బరువు తగ్గడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు. కొంచెం పట్టుదల ఉంటే తగ్గడం చాలా సులువు. బాగా ఆకలేసినపుడు తక్కువ క్యాలరీలు ఉండి బరువు పెరక్కుండా చూసే ఆహారం తీసుకోవాలి. దీన్నే శాటిస్‌ఫై ఇన్‌డెక్స్ అని అంటున్నారు. ఈ ఆహారంతో పాటు రోజుకు గంట వ్యాయామం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్‌తోపాటు కడుపు నిం డిందన్న భావన కలుగుతుంది.
ఉడకబెట్టిన ఆలూ: ఎక్కువ కార్బొహైడ్రేట్స్ కలిగి ఉంటాయని చాలా మంది ఆలు గడ్డలను దూరంపెడుతుంటారు. కానీ ఆలూలో చాలా పోషక విలువలున్నాయి. వేపుడును మాత్రం తినకుంటే సరిపోతుంది. దీంట్లోని గంజిలాంటి పదార్థం ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణశక్తికి చక్కగా పనిచేస్తుంది. ఇందువల్ల కడుపు నిండి, ఎక్కువ సమయం ఆకలి కలగదు. ఉడకబెట్టిన ఆలూ తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
కోడి గుడ్డు: ఎగ్ అధిక ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుం ది. బ్రేక్‌ఫాస్ట్‌లో రోజుకో గుడ్డు తి నడం వల్ల ఆరోగ్యానికి మంచిది. గుడ్డులోని పచ్చసొన తింటే గుండె కు హాని కలుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
ఓట్‌మీల్: దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజుమొత్తం ఆకలి కాకుండా చూడటంలో అ ద్భుతంగా పనిచేస్తుంది. ఓట్‌మీ ల్‌లో చెడ్డ కొలెస్ట్రాల్ లేదని పరిశోధనల్లో కూడా తేలింది. నీటి శాతం ఎక్కువే. దీంట్లోని బీటా గ్లూకోన్ అనే ఫైబర్ శరీరంలోని అధికంగా ఉన్న కార్బొహైడ్రేట్స్ తగ్గేలా చేస్తుంది.
సూప్: హోటల్‌కి వెళ్లగానే మనం ముందుగా ఆర్డర్ ఇచ్చేది సూప్‌ని. చాలా మందికి తెలియదు సూప్ తాగడం వల్ల సగం ఆకలి తీరుతుందని. కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం తెలిసింది. ఎక్కువ ఆహారాన్ని తినకుండా సూప్ అడ్డుకుంటుంది. దీంతో శరీరంలోకి అధిక క్యాలరీలు వెళ్లే అవకాశం ఉండదు.
ఆపిల్స్: కడుపు నిండిన ఫీలింగ్‌ను కలిగించడంలో ఆపిల్‌ది ముఖ్యపాత్రే. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఎక్కువ శాతం నీటిని కలిగి ఉందీ పండు. అతి తక్కువ క్యాలరీలుంటాయి. భోజనానికి ముందు యాపిల్ జ్యూస్ తాగమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్స్‌తో పాటు సిట్రస్ పండ్లు ఏవైనా సరే హాయిగా తినేయొచ్చు.
చేపలు, కొద్దిగా మాంసం: ప్రొటీ న్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ చేప. చేప లో క్యాలరీలు చాలా తక్కువ. దీం ట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఎక్కువ తిన్న ఫీలిం గ్ కలుగుతుంది.
పాప్‌కార్న్: ఎప్పుడైనా చిరుతిండ్లు తినాలనిపిస్తే పాప్‌కార్న్ తినమని రికమెండ్ చేస్తున్నారు నిపుణులు. తక్కువ క్యాలరీలు కలిగి, ఫైబర్ కలిగింది పాప్‌కార్న్. ఆలూ చిప్స్‌లాంటివాటి కంటే ఇవి మేలు చేస్తాయి. ఇంట్లో తయారు చేసుకున్నవైతే మరీ మంచిది. ఆలివ్ ఆయిల్, గార్లిక్, అవకాడో, టమేటో పౌడర్ లాంటి వాటితో తయారుచేసినవి రుచికరంగానూ ఉంటాయి. మరమరాలు, అటుకులు ఇవన్నీ మంచివి. తగ్గాలనుకుంటే, లేదా ఉన్న బరువును అలాగే కొనసాగించాలంటే పైన చెప్పిన వన్నీ సరిగ్గా తింటే సరిపోతుంది. ఇవన్నీ ఎంతో సాయపడతాయి. ఒక్కసారిగా డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకునేకంటే ఇలాంటి ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. ఇలాంటి ఎక్కువ ప్రొటీన్లు, ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. వీటితోపాటు ఒత్తిడి లేకుండా చూసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం.

ఆహారంతోపాటు వ్యాయామం తప్పనిసరి
కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రొటీన్లు, ఫైబర్‌లు ఎక్కువగా ఉన్న ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరక్కుండా ఉంటుంది. పెరిగిన బరువు కూడా తగ్గుతుంది. మరమరాలు, జొన్న అటుకులు ఇలాంటివన్నీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది. మధుమేహం అదుపులో ఉంటుంది. ఎగ్‌లోని పచ్చసొన కూడా మంచి కొలెస్ట్రాల్. అన్నం, చపాతీ తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, సీజనల్ పండ్లు ఎక్కువగా తినాలి. వీటన్నింటితోపాటు అరగంట అయినా సరే ఏదో ఒక వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ చేయాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఒత్తిడిలేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకుంటే ఒత్తిడి దూరమౌతుంది.

Weight control food

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బరువును అదుపులో ఉంచే ఆహారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.