మూడు భాషల్లో జిల్లా వెబ్‌సైట్…

  జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ జిల్లా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కలెక్టర్ కరీంనగర్ : జిల్లా ప్రజలు మూడు భాషలలో పూర్తి సమాచారం తెలుసుకునేలా వెబ్‌సైట్ రూపకల్పన చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్‌ఐసి రాష్ట్ర యూనిట్ మార్గదర్శకత్వంలో జిల్లా ఎన్‌ఐసి అధికారులు, ఉర్దూ ఆఫీసర్ రూపొందించిన కరీంనగర్ జిల్లా తెలంగాణ నూతన త్రిభాషా వెబ్‌సైట్‌ను (https://karimnagar.telangana.gov.in) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […] The post మూడు భాషల్లో జిల్లా వెబ్‌సైట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ జిల్లా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కలెక్టర్

కరీంనగర్ : జిల్లా ప్రజలు మూడు భాషలలో పూర్తి సమాచారం తెలుసుకునేలా వెబ్‌సైట్ రూపకల్పన చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్‌ఐసి రాష్ట్ర యూనిట్ మార్గదర్శకత్వంలో జిల్లా ఎన్‌ఐసి అధికారులు, ఉర్దూ ఆఫీసర్ రూపొందించిన కరీంనగర్ జిల్లా తెలంగాణ నూతన త్రిభాషా వెబ్‌సైట్‌ను (https://karimnagar.telangana.gov.in) ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు భాషల్లో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. ఇందులో సులువుగా సమాచారాన్ని శోధించవచ్చని, దివ్యాంగుల సౌలభ్యత, ప్రత్యేకమైన వెబ్ సర్వర్ ఏర్పాటు అవసరం లేకుండా, జాతీయ మౌళిక సదుపాయాల ఉపయోగాన్ని పొందవచ్చని అన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్ మార్గదర్శకాలు ఆధారంగా రూపొందించారని తెలిపారు. జాతీయ సైబర్ రక్షణ వ్యవస్థ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి సూచన విజ్ఞాన అధికారి గుండి రాకేష్, జెడ్పీ సీఈఓ వెంకట మాధవరావు, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు, మెప్మా పిడి వపన్‌కుమార్, డిస్ట్రిక్ట్ ఈ మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, ఉర్దూ ఆఫీసర్ ఆయేషా తలత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Website for full information in all three languages

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడు భాషల్లో జిల్లా వెబ్‌సైట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: