పురమే గోపురం

  సంస్కరణలు ప్రజలకు అందాలి కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన పెంచాలి త్వరలోనే మున్సిపల్ కమిషనర్లతో సమావేశమవుతా పురపాలక శాఖ కార్యాలయంలో అధికారులతో భేటీలో మంత్రి కెటిఆర్ ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థం అయినప్పుడు అధికారుల్లో పారదర్శకత పెరగడంతోపాటు ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుంది. హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. బుధవారం […] The post పురమే గోపురం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సంస్కరణలు ప్రజలకు అందాలి
కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన పెంచాలి
త్వరలోనే మున్సిపల్ కమిషనర్లతో సమావేశమవుతా
పురపాలక శాఖ కార్యాలయంలో అధికారులతో భేటీలో మంత్రి కెటిఆర్
ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థం అయినప్పుడు అధికారుల్లో పారదర్శకత పెరగడంతోపాటు ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుంది.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లో పురాపాలక శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కెటిఆర్ సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, సంచాలకులు శ్రీదేవి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్ , హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్. రెడ్డ్డి, పబ్లిక్ హెల్త్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని, చేపడుతున్న కార్యక్రమాల వివరాలును విభాగాల అధిపతులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు.

ప్రస్తుతం నడుస్తున్న అభివృద్ది కార్యక్రమాలను నసాగించడంతోపాటు ప్రభు త్వం ప్రారంభించిన పలు పరిపాలన సంస్కరణలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన పురపాలక చట్టంలోని సౌకర్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్ధం అయినప్పుడు అధికారుల్లో పారదర్శకత పెరగడంతోపాటు ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన పురపాలికల్లో ప్రజలకు నూతన చట్టంపైన మరింత అవగాహన తీసుకరావాలని కోరారు.

పురపాలనపైన ప్రభుత్వ ఆలోచనలను వివరించేందుకు త్వరలోనే అన్ని పురపాలికల కమిషనర్లతో హైదరాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు కెటిఆర్ సూ చించారు. పలుమున్సిపాలిటీల్లో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి కెటిఆర్‌కు శ్రీదేవి వివరించారు. ముఖ్యంగా పట్టణాల్లో ఎల్‌ఇడి లైట్ల బిగింపు, పార్కులు ఏర్పాటు, లేఅవుట్లలో ఖాళీ స్థలాల రక్షణ, వాటివినియోగం, ఒపెన్ జిమ్‌ల ఏర్పాటు, శ్మశానవాటికల అభివృద్ది(వైకుంఠధామాల ఏర్పాటు వంటి) ర్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కెటిఆర్ సూచించారు.

అలాగే పురపాలికల్లో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాం తాల్లో యుద్ధప్రాతిపదికన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
సమావేశంలోనే పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ హెచ్ యండిఏ ప్రణాళికలను వివరించారు. దీంతోపాటు జిహెచ్‌ఎంసి, జలమండలి, మెట్రోరైలు కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ అధిపతులు అయా విభాగాల కార్యాచరణను వివరించారు.

We need to raise Awareness of new Municipal Law

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పురమే గోపురం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.