మహిళలను గౌరవించే సంస్కృతి మనది…

  ఖమ్మం : ప్యానల్ స్పీకర్ రమాదేవిని ఉద్ధేశించి సభలో ఒక ఎంపీ చేసిన వాక్యాలు అభ్యంతరకరమని శుక్రవారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా సభ కార్యకలాపాలు నిర్వహణలో ఉన్న ప్యానల్ స్పీకర్ గురించి ఒక ఎంపీ చేసిన అభ్యంతరకర వాక్యాలను టీఆర్‌ఎస్ పక్షం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో తల్లి, భార్య, కూతురును లక్ష్మిదేవిలాగా చూసుకుంటూ మహిళలను […] The post మహిళలను గౌరవించే సంస్కృతి మనది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : ప్యానల్ స్పీకర్ రమాదేవిని ఉద్ధేశించి సభలో ఒక ఎంపీ చేసిన వాక్యాలు అభ్యంతరకరమని శుక్రవారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా సభ కార్యకలాపాలు నిర్వహణలో ఉన్న ప్యానల్ స్పీకర్ గురించి ఒక ఎంపీ చేసిన అభ్యంతరకర వాక్యాలను టీఆర్‌ఎస్ పక్షం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మన దేశంలో ప్రతి ఇంట్లో తల్లి, భార్య, కూతురును లక్ష్మిదేవిలాగా చూసుకుంటూ మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని నామ అన్నారు. అభ్యంతరకర వాక్యాలు చేసిన సభ్యునిపై నియమ నిబంధనలను అనుసరించి గౌరవ స్పీకర్ తనకున్న అధికారాలను ఉపయోగించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈ విషయమై స్పీకర్ మాట్లాడుతూ అన్ని పార్టీల నేతలతో సమావేశం, తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.

We have Culture that Respects Women

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళలను గౌరవించే సంస్కృతి మనది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: