వేసవిలో సర్వరోగ నివారిని పుచ్చకాయ…

  మండు వేసవిలో చల్ల చల్లగా రోడ్లపై జోరుగా అమ్మకాలు హుజూరాబాద్ : పుచ్చకాయ పేరు చేప్పగానే ఓ చల్లని అనుభూతి కలుగుతుంది. వేసవిలో వేడిని తట్టుకోవాలంటే శరీరానికి పుచ్చకాయ ఎంతో అవసరం ఈ కాయని ఇష్టపడని వారంటు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద అంత అమ్మితంగా ఇష్టపడే పుచ్చకాయలో గొప్ప ఔషద గుణాలున్నాయి. వేసవి కాలంలో పుచ్చకాయలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా పట్టణాల్లో గత కొన్ని రోజులుగా రహదారి పక్కన భారీగా […] The post వేసవిలో సర్వరోగ నివారిని పుచ్చకాయ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మండు వేసవిలో చల్ల చల్లగా

రోడ్లపై జోరుగా అమ్మకాలు

హుజూరాబాద్ : పుచ్చకాయ పేరు చేప్పగానే ఓ చల్లని అనుభూతి కలుగుతుంది. వేసవిలో వేడిని తట్టుకోవాలంటే శరీరానికి పుచ్చకాయ ఎంతో అవసరం ఈ కాయని ఇష్టపడని వారంటు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద అంత అమ్మితంగా ఇష్టపడే పుచ్చకాయలో గొప్ప ఔషద గుణాలున్నాయి. వేసవి కాలంలో పుచ్చకాయలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా పట్టణాల్లో గత కొన్ని రోజులుగా రహదారి పక్కన భారీగా పుచ్చకాయల అమ్మకాలు జరుగుతున్నాయి. మన దేశంలో ఈ పంట ఒక ఉద్యాన వన పంటగా కొనసాగుతుంది. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, పుచ్చకాయలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే యాంటి ఆక్సిడెంట్లు, బీ విటమిన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రో లైట్లు ఉంటాయి.

రక్తపోటు, గుండె పోటు నివారణకు…

రక్తపోటు అధికంగా ఉన్న వారు పుచ్చకాయ తినడంతో అధిక ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ఉండే పోటాషియం, మెగ్నీషియంలు రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉన్నారు. ఈ పుచ్చకాయలో 92శాతం ఆల్కలైన్ వాటర్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదం పుచ్చకాయలో ఉండే పోలేట్, విటమిన్ బి6 వల్ల తగ్గుతుంది. పుచ్చకాయ తినడం వల్ల మహిళల్లో గుండె పోటు దాదాపుగా 50శాతం వరకు తగ్గినట్లు నూతన అధ్యయన వల్ల తెలింది.

క్యాన్సర్ నివారణకు…

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణకు పుచ్చకాయ ఎంతో ఉపకరిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తన పరిశోధనలో తెల్చి చెప్పింది. పుచ్చకాయలో బీటా, కిరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఇది క్యాన్సర్ వ్యాధి కారకాలను నిరోధిస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సుర్లు, స్వరపేటిక క్యాన్సర్లు రాకుండా పుచ్చకాయలోని బీటా, కిరోటిన్లు ఘననియంగా నిరోధిస్తాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తమ నివేధికలో పేర్కొంది.

జన్మతా: ప్రాప్తించే వ్యాధులు…

పుచ్చకాయలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. గర్భిణు మహిళలు పుచ్చకాయలు తినడం వల్ల గర్భాదారణ సమయంలో జరిగే ప్రమాదాలు నివారించవచ్చు. తల్లి పుచ్చకాయ తినడం వల్ల జన్మతా: పిల్లల్లో వచ్చే గ్రహానం మోర్రి తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది.

మూత్రపిండాలు

మూత్రా సంబంధిత వ్యాధులు కల వారు ప్రతిరోజు గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనే కలిపి తీసుకుంటే మూత్ర పిండ వ్యాధులు గుండె జబ్బులు తగ్గుతాయి. మూత్రాల్లో రాళ్లు తయారైనవారు. మూత్రం సరిగా రాని వారు మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు పుచ్చకాయ తింఒటే దానిలో ఉన్న నీళ్లు పోషకపదార్థాలు, మూత్రపిండాల్లోని సకాల రోగులను తొలగిస్తాయిన పరిశోధన నివేధికలు చెబుతున్నాయి.

కామెర్లు ….

కామెర్లు పైత్యం… వికారాలు, తలనొప్పి, నోరు తాడారిపోవడం, మూత్ర మార్గంలో ఇన్ఫ్‌క్షాన్ లాంటివి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావారు పుచ్చకాయ రసంతో పాటు సమానంగా మజ్జిగ కలిపి ఉప్పు, సరిపడినంత వేసుకొని తాగితే వ్యాధులు వారి ధరికి చేరే అవకాశం లేదు.

గ్యాస్ సంబంధిత వ్యాధులు…

విరోచనలు, కడుపునొప్పి, ఉబ్బారం, గ్యాస్ట్‌ఎంట్రాలజికి సంబంధించిన అనారోగ్యం బంక విరోచనాలు, వాంతులు, వికారం లాంటి సమస్యలతో బాగా నిరసమై పోయిన వారికి పుచ్చకాయ ముక్కలు కోసి తినిపిస్తే ఫలితం ఉంటుంది. వాటితో పాటు పుచ్చకాయ ముక్కలు కోసి రసం తీసి గ్లూకోజ్, తేనే, నిమ్మరసం కలిపిస్తే చెప్పిన అనారోగ్యాలన్ని తొలిగిపోతాయి.

నిద్రలేమిని నివారిస్తుంది…

నిద్రలేమితో బాధపడే వారు మానసిక సమస్యలతో బాధపడే వారు హిస్టిరియా వంటి మానసిక రుగ్మాత గల వారు పుచ్చకాయను మధ్యకు కోసి కొంత మేర గుజ్జును తొలగించి తలకు టోపి మాదిరిగా పుచ్చకాయను పెట్టుకొని కొన్ని గంటల ఉంచితే రోగాల నుంచి బయటపడి మానసికంగా ప్రవాంతంగా ఉంటుంది.

వడదెబ్బ నివారణకు …

వేసవి కాలంలో ఎంతో మంది ప్రాణాలు తీసే వడదెబ్బ నివారణకు పుచ్చకాయ దివ్య ఔషదంగా పనిచేస్తుంది. అతి దాహం, చెమట ద్వారా ఖనిజ లవణాలను కోల్పయిన వారు పుచ్చకాయ తింటే వెంటనే వడదెబ్బ భారీ నుంచి బయటపడే అవకాశాలుంటాయి. పుచ్చకాయ రసాన్ని తేనేలో కలిపి తాగితే వడదెబ్బ లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

కీళ్లనొప్పులు…

కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే శరీరంలో కాల్షియం నిల్వల సమర్థం పెరిగి కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.

Watermelon has Great Medicinal Properties

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేసవిలో సర్వరోగ నివారిని పుచ్చకాయ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: