సాగర్ డ్యాం 10 గేట్ల ఎత్తివేత

 Sagar Dam

 

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువ నుండి 2,02,319 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో ఆదివారం సాగర్ 10 క్రస్టుగేట్ల నుండి నీటిని దిగువకు విడుదల చేశారు. 10 క్రస్టుగేట్లను 10 అడుగుల ఎత్తు లేపి గేట్ల నుండి 1,50,130 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహంను అంచనా వేస్తూ నీటి విడుదలను చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 590.00 అడుగులు.

సాగర్ జలాశయం నుండి కుడికాల్వ ద్వారా 9,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,454 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 32,683 క్యూసెక్కులు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు విడుదల జరుగుతుంది. సాగర్ జలాశయంకు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 2,02,319 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఆదివారం పర్యాటకుల సంఖ్య కొంత పెరిగింది. సాగర్‌లోని కొత్త వంతెన, ప్రధాన విద్యుత్‌కేంద్రం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. నాగార్జునకొండకు లాంచీల రాకపోకలు లేకపోవడంతో లాంచీస్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుతిరిగారు.

Water release through 10 gates of Sagar Dam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగర్ డ్యాం 10 గేట్ల ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.