సాగర్‌ నుంచి నీటి విడుదల

Nagarjuna Sagar Projectనల్లగొండ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఆదివారం నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో ఎత్తిపోతల పథకాలైన లో లెవల్ కెనాల్, ఎఎమ్మార్పీ కాల్వలకు కూడా నీటి విడుదల చేశారు. కుడి కాల్వ ద్వారా ఎపిలో 11 లక్షల ఎకరాలకు నీరందనుంది. శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరద నీటితో నాగార్జున సాగర్ వేగంగా నిండుతోందని అధికారులు తెలిపారు.

Water Release From Nagarjuna Sagar Project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగర్‌ నుంచి నీటి విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.