బాలింతలు, గర్భిణీలకు పురుగు పడ్డ గుడ్లు పంపిణీ

Anganwadi Center

 

ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం చిన్నారులు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం ఎంతో గొప్ప కార్యక్రమాలు చేపడుతుంది. కాని వారికి పంపిణీ చేస్తున్న సరుకులు మాత్రం నాసిరకంగానే వస్తున్నాయి. వివరాల్లోకీ వెళ్లితే… జిల్లాలోని నార్నార్ మండలం అంగన్ వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడానికి వచ్చిన గుడ్లలో పురుగులు ఉన్న చోటు చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ గజానంద్ నాయక్‌కు తెలుపగా అతను అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి ఐసిడిఎస్ సూపర్‌ వైజర్ కు ఫిర్యాదు చేశారు.

వేంటనే అక్కడికి చేరుకొని అంగన్వాడీ టీచర్‌లను పురుగులు పట్టిన గుడ్డుపై వివరణ అడగగా సంబంధిత టెండర్‌ కాంట్రాక్టర్‌ ఇటువంటి నాసిరకం గుడ్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ఇటువంటి నాసిరకం సరుకులు పంపిణీ చేసి గిరిజన చిన్నారుల ఆరోగ్యాలతో ఆడుకోవద్దన్నారు. ఎవరైతే సరుకులు పంపిణీ చేస్తున్న గత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్‌ కోరారు.  చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని వాటిని దుర్వినియోగం చేయద్దన్నారు.

Wasted eggs distribution for pregnant women

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలింతలు, గర్భిణీలకు పురుగు పడ్డ గుడ్లు పంపిణీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.