వ్యర్ధ కెమికల్స్ తగలబడి ఇబ్బందుల్లో స్ధానికులు…

  శంషాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు భారీగా డ్రమ్స్‌లలో వ్యర్ధ కెమికల్స్‌ను తీసుకువచ్చి శంషాబాద్ గ్రామానికి, సాతంరాయ్ గ్రామానికి సరిహద్దులో ఉన్న ఫిరాంగి నాలాలో డంపింగ్ చేశారు. డంపింగ్ చేసిన వ్యర్ధాలకు శనివారం ఉదయం మంటలు అంటూకొని జాతీయ రహదారితో పాటు పక్కనే ఉన్న సాతంరాయ్ గ్రామాన్ని దట్టమైన నల్లని పొగ కమ్మివేయడంతో కండ్ల మంటలతో స్ధానిక ప్రజలతో పాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న […] The post వ్యర్ధ కెమికల్స్ తగలబడి ఇబ్బందుల్లో స్ధానికులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శంషాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు భారీగా డ్రమ్స్‌లలో వ్యర్ధ కెమికల్స్‌ను తీసుకువచ్చి శంషాబాద్ గ్రామానికి, సాతంరాయ్ గ్రామానికి సరిహద్దులో ఉన్న ఫిరాంగి నాలాలో డంపింగ్ చేశారు. డంపింగ్ చేసిన వ్యర్ధాలకు శనివారం ఉదయం మంటలు అంటూకొని జాతీయ రహదారితో పాటు పక్కనే ఉన్న సాతంరాయ్ గ్రామాన్ని దట్టమైన నల్లని పొగ కమ్మివేయడంతో కండ్ల మంటలతో స్ధానిక ప్రజలతో పాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటహుటిన సంఘటన స్ధలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

Waste Chemicals Burned and locals in Trouble

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వ్యర్ధ కెమికల్స్ తగలబడి ఇబ్బందుల్లో స్ధానికులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.