రన్నింగ్‌కి ముందు వార్మప్ తప్పనిసరి

Warm Up

 

వాకింగ్, జాగింగులు చేస్తే మోకాళ్లకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని చాలా భావిస్తారు. కానీ, ఈ నొప్పులు తరుచుగా వస్తున్నట్లయితే కొన్ని వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఒకేసారి ఎక్కువ దూరం కాకుండా క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. కాలు, పిక్క కండరాలు గట్టిపడే స్క్వాట్, బ్రిడ్జెస్, హిప్ స్టెబిలిటీ వ్యాయామాల్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామానికి ముందు కండరాలను చైతన్యవంతంగా ఉంచడానికి వార్మప్ అవసరం. అలా ఏమీ చేయకుండా సరాసరిగా రన్నింగ్‌లు, జాగింగ్‌లు చేస్తే, కలిగే లాభం మాట అటుంచి, మోకాలు కీలు మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంది.

ఇతర వ్యాయామాలన్నీ చేశాక కూడా రన్నింగ్‌లో నొప్పి అనిపిస్తే, కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవాలి. ఐస్ గడ్డను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న భాగాల్లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. నొప్పి తగ్గగానే మళ్లీ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇలా తగ్గిన నొప్పి అంతటితో పూర్తిగా పోతే సరే సరి! ఒకవేళ కొద్ది రోజుల తర్వాత నొప్పి మళ్లీ వస్తే, వెంటనే ఫిజియో థెరపి్‌స్టను గానీ, ఆర్థోపెడిక్ డాక్టర్‌ను గానీ సంప్రదించాలి.

 

Warm Up is a must before Running

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రన్నింగ్‌కి ముందు వార్మప్ తప్పనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.