వార్డెన్లు విధుల్లో బాధ్యత వహించాలి

  నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వార్డెన్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, సంక్షేమ వసతి గృహాలలో సమస్యలపై పోలీస్, రెవెన్యూ, విద్యా, వైద్య, మున్సిపల్, ఆర్‌డబ్లుఎస్, ట్రాన్సు కో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో ఎటువంటి […] The post వార్డెన్లు విధుల్లో బాధ్యత వహించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వార్డెన్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, సంక్షేమ వసతి గృహాలలో సమస్యలపై పోలీస్, రెవెన్యూ, విద్యా, వైద్య, మున్సిపల్, ఆర్‌డబ్లుఎస్, ట్రాన్సు కో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు తరచుగా హాస్టళ్లను సందర్శించి సమస్యలపై ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలన్నారు.

వసతిగృహాలలో ముఖ్యంగా విద్యార్థినుల వసతి గృహాలలో ఎటువంటి అవాంఛనీయ శక్తులు ప్రవేశించే ఇబ్బంది లేకుండా హాస్టళ్ల విద్యార్థుల రక్షణ, భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల హాస్టళ్ళ వివరాలను సంబంధిత పోలీస్ అధికారులకు అందచేయాలని కలెక్టర్ కోరారు. హాస్టళ్లలో భద్రతపరంగా పోలీస్ సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేకాకుండా పోలీస్, అసుపత్రి, ట్రాన్స్‌కో, వైద్య, ఇతర అధికారుల ఫోన్‌నెంబర్లు హాస్టళ్లలో ప్రదర్శించాలని, హాస్టళ్లలో అమృత్ ప థకం క్రింద మంచినీటి సరఫరా కనెక్షన్ అందచేసేందుకు పబ్లిక్ హెల్త్ ఈఈడిఈకి సంబంధిత అధికారులకు లేఖ పంపించాలన్నారు.

హాస్టళ్లలోని విద్యార్ధులకు అనారోగ్యం, ఎమర్జేన్సీ ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రి మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రికి సంబంధించి డాక్టర్లు అప్రమత్తంగా ఉండి స్పందించాలన్నారు. షీటీమ్ పోలీస్ మొబైల్ వాహనాలు హాస్టళ్ళలో భద్రతపరంగా గట్టి నిఘా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.రవీంద్రనాథ్, డిఎస్పీ గంగారాం, బిసి సంక్షేమ శాఖాధికారి విమల, ఆర్‌డబ్లుఎస్ ఈఈ పాపారావ్, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Wardens should be in charge of Duties

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వార్డెన్లు విధుల్లో బాధ్యత వహించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: