కెటిఆర్ తో వరంగల్ మేయర్ భేటీ

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌ రావు మంగళవారం భేటీ అయ్మారు. వరంగల్‌ మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ రావును కెటిఆర్‌ అభినందించారు. మేయర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కెటిఆర్, స్థానిక నేతలతో పాటు పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన టిస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లుకు ప్రకాశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రకాశ్ రావుకు కెటిఆర్ సూచించారు. సహచర కార్పొరేటర్లను కలుపుకుని […] The post కెటిఆర్ తో వరంగల్ మేయర్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌ రావు మంగళవారం భేటీ అయ్మారు. వరంగల్‌ మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ రావును కెటిఆర్‌ అభినందించారు. మేయర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కెటిఆర్, స్థానిక నేతలతో పాటు పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన టిస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లుకు ప్రకాశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రకాశ్ రావుకు కెటిఆర్ సూచించారు. సహచర కార్పొరేటర్లను కలుపుకుని ముందుకు సాగుతూ వరంగల్ అభివృద్ధికి పాటుపడాలని ఆయన మేయర్ గుండా ప్రకాష్ రావుకు సూచించారు.  కెటిఆర్‌ను కలిసిన వారిలో మేయర్ గుండా ప్రకాష్‌రావుతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపి బండ ప్రకాష్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాజయ్య, పసునూరి దయాకర్‌ ఉన్నారు.

Warangal Mayor Meets KTR at Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెటిఆర్ తో వరంగల్ మేయర్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: