హార్రర్ థ్రిల్లర్

Edaina Jaragochu Movie Teaser

 

ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రమాకాంత్ దర్శకుడు. పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పటి నుండి శివాజీరాజాతో మంచి పరిచయం ఉంది. ఇప్పుడు ఆయన తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతున్నాడు. తను చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ “వినాయక్ చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న మా అబ్బాయి విజయ్‌రాజాను ఆశీర్వదించండి”అని తెలిపారు. దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ “ఇదొక హార్రర్ థ్రిల్లర్. మంచి టీం కుదిరింది. మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన వి.వి.వినాయక్‌కు థాంక్స్‌”అని చెప్పారు. బాబీ సింహ, రాఘవ, నాగబాబు, అజయ్‌ఘోష్, వెన్నెల కిషోర్, పృథ్వీ, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సమీర్ రెడ్డి, సంగీతంః శ్రీకాంత్ పెండ్యాల, ఎడిటర్‌ః ఎస్.బి.ఉద్ధవ్, డైలాగ్స్‌ః వికర్ణ.

VV Vinayak released the Edaina Jaragochu Movie Teaser

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హార్రర్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.