వెబ్‌సైట్‌లో విఆర్‌ఒ ప్రాథమిక కీ

హైదరాబాద్: విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) రాత పరీక్ష ప్రాథమిక కీ ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 30 తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఒఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోండి విఆర్‌ఒ రాత పరీక్షకు హాజరైన 7,87,049 మంది అభ్యర్థుల డిజిటల్ ఒఎంఆర్ […]

హైదరాబాద్: విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) రాత పరీక్ష ప్రాథమిక కీ ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 30 తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.

ఒఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోండి
విఆర్‌ఒ రాత పరీక్షకు హాజరైన 7,87,049 మంది అభ్యర్థుల డిజిటల్ ఒఎంఆర్ జవాబు పత్రాలను పరీక్ష జరిగిన ఐదు రోజుల్లోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు తమ డిజిటల్ ఒఎంఆర్ జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు తలెత్తితే కమిషన్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. చెల్లుబాటుకాని ఒఎంఆర్ జవాబు పత్రాల జాబితాను హాల్‌టికెట్ నెంబర్లతో వెబ్‌సైట్‌లో త్వరలో పొందుపరుస్తామన్నారు.

Comments

comments

Related Stories: