రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఒ మృతి

  ఖమ్మం: మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ అధికారి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లాడ మండల పరిధిలోని బాలపేట రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె. త్రిమూర్తి తల్లాడ నుండి అన్నారుగూడెం వైపు వేళ్తున్నాడు. కొత్తగూడెం నుండి తల్లాడ వైపు వస్తున్న ఆర్టీసి బస్సు స్ధానిక శ్రీకృష్ణ కోల్డ్ సోర్టేజ్ దగ్గరకు రాగానే ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకోట్టడంతో తలకు తీవ్రగాయాలై విఆర్ఒ […] The post రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఒ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ అధికారి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తల్లాడ మండల పరిధిలోని బాలపేట రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె. త్రిమూర్తి తల్లాడ నుండి అన్నారుగూడెం వైపు వేళ్తున్నాడు. కొత్తగూడెం నుండి తల్లాడ వైపు వస్తున్న ఆర్టీసి బస్సు స్ధానిక శ్రీకృష్ణ కోల్డ్ సోర్టేజ్ దగ్గరకు రాగానే ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకోట్టడంతో తలకు తీవ్రగాయాలై విఆర్ఒ అక్కడక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి మృతిదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం మధిర ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా బాలపేట వెళ్తున్న కె. త్రిమూర్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శివాజి, తల్లాడ తహాశీల్దారు డి.యస్. వెంకన్నలు మృతిచెందిన త్రీమూర్తులు కుటుంబానికి తక్షణ సహాయంగా 20వేల రూపాయలు, మరియు ఎన్నికల విధుల్లో మృతిచెందడంతో మరోక 50వేలు కలిపి మొత్తం 70వేల రూపాయలు మృతుడి భార్యకు కల్లూరు ఆర్‌డిఒ శివాజి అందజేసి వారి కుటంబ సభ్యులను, బందువులను ఓదార్చి సంతాపాన్ని తెలియజేసినారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తల్లాడ యస్‌ఐ వారాల శ్రీనివాసరావు తెలిపారు.

VRO died in Road Accident at Khammam

The post రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఒ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: