ఒటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి

  ఆదిలాబాద్‌ : ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. శుక్ర వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవరణ ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రకటించా రు. ఈ నెల 16 నుంచి దశల వారీగా ఈ ప్రక్రియ కొనసాగు తుందని, ప్రతి ఓటరు తమ పేర్లను పరిశీలించుకొని సమా చారం లో తప్పులను […] The post ఒటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్‌ : ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు సవరణల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. శుక్ర వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవరణ ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రకటించా రు. ఈ నెల 16 నుంచి దశల వారీగా ఈ ప్రక్రియ కొనసాగు తుందని, ప్రతి ఓటరు తమ పేర్లను పరిశీలించుకొని సమా చారం లో తప్పులను సరి చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గం, బూత్, గ్రామాల నుంచి తమ ఓటును మార్చుకోనేందుకు సైతం అవకా శం ఉంటుందన్నారు.

ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమఏజెంట్లను నియమించుకొని ఓటర్లకు సహకరించాలని సూచించారు. 18 సంవ త్సరాలు నిండిన యువతి, యువకులు సైతం తమ పేర్లను జాబితాలో నమోదు చేసు కోవాలన్నారు. అనంతరం నూతన ఆవిష్క రణలపై నిర్వహిస్తున్న పోటీ లకు సంబంధించిన పోస్టర్లను అసిస్టెంట్ కలెక్టర్ గోపి, డిఆర్‌వో నటరాజన్,ఆర్డీవో సూర్యనా రాయణలతో కలిసి ఆవిష్కరించారు. ప్రతివ్యక్తి నూతనంగా ఆలోచిస్తూ తమ సమస్యలను పరిష్కరించు కొనేం దుకు ప్రయత్నిస్తారన్నారు. తమ ఆవిష్కరణలను వీడియో రూపంలో పంపించి పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.

Voters have to Register their Names in list

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: