త్వరలో వివో జడ్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల

Vivo Z1 Pro

 

ప్రముఖ మొబైల్స్ సంస్థ వివో తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త వివో జడ్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్ లో త్వరలో విడుద‌ల చేయ‌నుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.14,075 ధరకు ప్రారంభం కనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 8, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 4/6/8 జిబి ర్యామ్‌, 64/128 జిబి  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటుంది.

వివో జ1 ప్రొ ఫీచర్లు…

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్,

4/6/8 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్,

256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై,

16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి తదితర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ లో ఉన్నాయి.

Vivo Z1 Pro Smartphone releases in India soon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post త్వరలో వివో జడ్1 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.