వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్

Vivo Y19

 

చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తన తాజా స్మార్ట్ ఫోన్ వివో వై19ను భారత మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 17 గంటల పాటు ఈ ఫోన్ పని చేస్తుందని వివో తెలిపింది. ఈ ఫోన్ యూఎస్ బీ టైప్-సీని సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇందులో యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లు కూడా ఉన్నాయి. కాగా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.

Vivo Y19 launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.