వివో నుంచి కొత్త ఫోన్.. ధర రూ.8,990

Vivo Y11 model

 

హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. వై సిరీస్‌లో వివో వై11 మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ.  ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రావడం విశేషం. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,990. వివో ఇండియా స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్, బజాజ్ స్టోర్లల్లో కూడా ఫోన్ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 31 లోపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఈ ఫోన్ కొనేవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 28 నుంచి అందుబాటులో ఉంటుంది.

వివో వై11 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.35 అంగుళాల హెచ్‌డీ+ హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే

ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: మినరల్ బ్లూ, అగేట్ రెడ్.

Vivo Y11 model released from Vivo

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివో నుంచి కొత్త ఫోన్.. ధర రూ.8,990 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.