భారత్ నుంచి సింగపూర్‌కు సందర్శకులు ఎక్కువ…

  సింగపూర్ టూరిజం బోర్డు రీజినల్ డైరెక్టర్ జి.బి.శ్రీథర్ హైదరాబాద్ : ఇండియా నుంచి 1.44 మిలియన్ల సందర్శకులు సింగపూర్‌ను సందర్శించారని సింగపూర్ టూరిజం బోర్డు రీజనల్ డైరెక్టర్ (ఇండియా, మిడిల్ స్ట్, సౌత్‌ఆసియా) జి.బి.శ్రీథర్ పేర్కొన్నారు. ఎనిమిది నగరాల్లో ట్రావెల్ వాణిజ్యంతో తమ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీథర్ మాట్లాడుతూ వరుసగా నాలుగవ సారి ఇండియా నుంచి ఒక మిలియన్ […] The post భారత్ నుంచి సింగపూర్‌కు సందర్శకులు ఎక్కువ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సింగపూర్ టూరిజం బోర్డు రీజినల్ డైరెక్టర్ జి.బి.శ్రీథర్

హైదరాబాద్ : ఇండియా నుంచి 1.44 మిలియన్ల సందర్శకులు సింగపూర్‌ను సందర్శించారని సింగపూర్ టూరిజం బోర్డు రీజనల్ డైరెక్టర్ (ఇండియా, మిడిల్ స్ట్, సౌత్‌ఆసియా) జి.బి.శ్రీథర్ పేర్కొన్నారు. ఎనిమిది నగరాల్లో ట్రావెల్ వాణిజ్యంతో తమ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీథర్ మాట్లాడుతూ వరుసగా నాలుగవ సారి ఇండియా నుంచి ఒక మిలియన్ సందర్శకుల మార్కును దాటడం విశేషమన్నారు. సింగపూర్‌లో పర్యటించే మూడవ అతిపెద్ద సందర్శకుల మార్కెట్‌గా భారతదేశం కొనసాగుతోందన్నారు.

దీంతోపాటు క్రూయిజ్ ప్రయాణానికి అగ్రశ్రేణి మార్కెట్‌గా తన స్థానాన్ని నిలుపుకుందన్నారు. ఇండియాకు చెందిన అన్ని భాషల హీరోలు, నటులు, హీరోయిన్లు సింగపూర్‌ను సందర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సింగపూర్ టూరిజం బోర్డు భారతదేశంలోని కీలక మెట్రోపాలిటన్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల నుంచి విభిన్నమైన పర్యాటకులను సింగపూర్ నుంచి ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం తమ పరిధిని విస్తరించడంలో భాగంగా ఎనిమిది నగరాల్లో రోడ్ షోలను (గోయింగ్ కనెక్షన్, ఎచీవింగ్ టుగెదర్) నేపథ్యంలో 45 మంది సింగపూర్ టూరిజం వాటాదారులతో కలిసి నిర్వహించబోతున్నట్టు ఆయన తెలిపారు.

స్థానిక ట్రావెల్ సంస్థలతో భాగస్వామ్యం
హైదరాబాద్, మధురై, త్రివేండ్రం, కోల్‌కత్తా, రాజ్‌కోట్, గౌహతీ, నాగ్‌పూర్, జలందర్ తదితర నగరాల్లో ఈ షోలను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్ షోల వలన ప్రస్తుత భాగస్వామ్యాలు బలోపేతం అవ్వడంతో పాటు స్థానిక ట్రావెల్ వాణిజ్య సంస్థలతో నూతన భాగస్వా మాలను ఏర్పరుచుకుంటామన్నారు. ఈ రోడ్ షోలలో కీలక వాటాదారులైన హోటల్స్, ఎయిర్‌లైన్స్, ఇంటిగ్రేటెడ్ రిసార్ట్, అట్రాక్షన్, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (డిఎంసీ), క్రూయిజ్ ఆపరేటర్లు పాల్గొంటారన్నారు. మొట్టమొదటి సారిగా భారతదేశంలో ఓ అంతర్జాతీయ టూరిజం ఏజెన్సీతో ఇంగ్లీషు మ్యూజిక్ వీడియో భాగస్వామ్యాన్ని వీహెచ్1తో చేసుకోవడంతో పాటు, పేటిఎం, ఓలా లాంటి అధిక వినియోగదారులున్నా బ్రాండ్లతో మార్కెటింగ్ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. దీంతోపాటు దక్షిణ భారత మార్కెట్‌ను లక్షంగా చేసుకొని మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో మ్యూజిక్ ప్రొమోషనల్ భాగస్వామ్యం చేసుకున్నామన్నారు.

వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్
సింగపూర్‌లో హాలీడేస్‌ను ప్రచారం చేసేందుకు 21 నగరాల్లోని ట్రావెల్ మధ్యవర్తులతో ఒప్పందం చేసుకొని ట్రావెల్ ఔట్ రీచ్‌లను చేపట్టామన్నారు. రెండోసారి స్టార్ట్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆర్ట్ ఫెస్టివల్, సింగపూర్ వీకెండర్‌ను న్యూఢిల్లీలో సమర్పించ బోతునట్టు ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్ షోలలో భాగంగా స్కూట్, సిల్క్, ఎయిర్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లు ప్రత్యేకమైన ధరలను (భారతదేశం నుంచి సింగపూర్ ప్రయాణించే) పర్యాటకుల కోసం వెల్లడిస్తాయన్నారు. ఈ ధరలు ఈనెల 8వ తేదీ నుంచి ఈనెలాఖరు వరకు ప్రొమోషన్ కాలంలో అందుబాటులో ఉంటాయన్నారు.

Visitors are coming to Singapore from India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్ నుంచి సింగపూర్‌కు సందర్శకులు ఎక్కువ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.