పలు రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ

ట్రినిడాడ్: భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 120 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ శతకంతో  విరాట్ కోహ్లీ 42 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో విరాట్ కంటే ముందు 49 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిటి ఉంది. […] The post పలు రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ట్రినిడాడ్: భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 120 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ శతకంతో  విరాట్ కోహ్లీ 42 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో విరాట్ కంటే ముందు 49 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిటి ఉంది. ఆస్ట్రేలియాపై సచిన్ తొమ్మిది సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విండీస్ పై ఎనిమిది సెంచరీలతో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడు దేశాలు శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై ఎనిమిదేసి సెంచరీల చేసిన రికార్డు కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా ఉండి రిక్కీ పాంటింగ్ 22 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ 20 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉండగా రిక్కీ పాంటింగ్ 71 సెంచరీలతో రెండో స్థానం, విరాట్ కోహ్లీ 67 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మొత్తం స్కోర్(11363)ను విరాట్ కోహ్లీ (11406)అధగమించాడు. విండీస్ పై కోహ్లీ 2032 పరుగులు చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ఇంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ విండీస్ పై 1930 పరుగులు చేశాడు. విండీస్‌పై 34 ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు చేసి తొలి స్థానంలో కోహ్లీ ఉండగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 37 ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం సచిన్ పేరిట ఉంది. శ్రీలంకపై 3113 పరుగులు, ఆసీస్‌పై 3077 రెండు కూడా సచిన్ పేరిట ఉన్నాయి.

 

Virat Kohli Breaks Two Records in ODI

The post పలు రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: