స్మిత్ కంటే కోహ్లినే ఉత్తమం: ఇయాన్ చాపెల్

Virat Kohli better than to Smith says Ian chappell

సిడ్నీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని, వీరిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అందరికంటే అత్యుత్తమ ఆటగాడు అనడంలో సందేహం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఎదురులేని బ్యాట్స్‌మెన్‌లుగా కొనసాగుతున్నారన్నాడు. అయితే వీరిలో స్మిత్‌తో పోల్చితే విరాట్ చాలా మెరుగైన ఆటగాడని చాపెల్ పేర్కొన్నాడు. కాగా, సమకాలిన క్రికెట్‌లో ఉత్తమ క్రికెటర్ల అంశం నిరంతం చర్చలోకి వస్తూనే ఉందని, గతంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మధ్య ఎవరూ బెస్ట్ అనే చర్చ ప్రపంచ క్రికెట్‌లో కొనసాగేదన్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య ఇలాంటి చర్చే కొనసాగుతుందన్నాడు. వీరిలో ఎవరూ ఉత్తమ క్రికెటర్ అనే దానిపై తేల్చేశాడు. స్మిత్‌తో పోల్చితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే ఉత్తమ క్రికెటర్ అని చాపెల్ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా స్మిత్‌తో పోల్చితే కోహ్లి చాలా ముందు వరుసలో నిలుస్తాడనిచాపెల్ అభిప్రాయపడ్డాడు. జట్టును నడిపించడంలో, దూకుడుగా ఆడడంలో కోహ్లిదే పైచేయి అనడంలో సందేహం లేదన్నాడు.

Virat Kohli better than to Smith says Ian chappell

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post స్మిత్ కంటే కోహ్లినే ఉత్తమం: ఇయాన్ చాపెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.