మూడు తొండాల విఘ్నేశుడు

లక్ష్మీగణపతి గరిక ప్రియుడు

అష్ట గణపతుల్లో లక్ష్మీ గణపతిని సకల సంపదలూ ఇచ్చే స్వామిగా కొలుస్తారు. ఇక ఆ స్వామికి తొండం కుడివైపునకు ఉంటే ఇంకా శుభం అంటారు. అందుకే అసీఫాబాద్‌లో కొలువై ఉన్న లక్ష్మీగణపతి స్వామి అంటే స్థానికులకు ఎంతో నమ్మకం. తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా, అసీఫాబాద్ పట్టణ బ్రహ్మణవాడలో ఉన్న లక్ష్మీగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో తమ బానిస నంకెళ్లు తెంచమని కోరుకుని స్థానికులు ఇక్కడ లక్ష్మీగణపతి స్వామివారికి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారట. అప్పట్నించీ ఆ చట్టు పక్కల గ్రామాల భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధికెక్కాడు ఈ స్వామి. మొదట్లో మట్టి గోడలూ, రేకులపైకప్పుతో నిర్మించిన ఈ ఆలయ శిథిలావస్థకు చేరడంతో 1972లో పురర్నిర్మించాలని భావించారు స్థానికులు. దాంతో ఆ నాటి ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుడు దండ నాయకుల రాంచందర్‌రావు పైకాజీ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని ముందుకొచ్చినట్టు చెబుతారు. మూలవిరాట్ వినాయకుడి విగ్రహంతోపాటు ఈ లక్ష్మీగణపతి ఆలయంలో శివ పంచాయతన విగ్రహాలైన గణపతి, శివుడు, పార్వతి, వెంకటేశ్వరుడు లక్ష్మి, సూర్యుడు, నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ వినాయకుడికి ప్రతి రోజూ 21 దూర్వాలను (గరిక) సమర్పిస్తూ 21రోజులు గరికతో పూజలు చేస్తే కార్యసిద్ధి కలుగుతుందనీ సకల సంపదలూ లభిస్తాయని భక్తుల నమ్మకం.

ఏపని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడినే. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలున్నాయంటే ఆశ్చర్యపడకమానం. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూనెలో ఉన్న సోమ్వార్‌పేట్ జిల్లాకి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉందీ త్రిసూంద్ గణపతి దేవాలయం.

బీమజిగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1954లో మొదలుపెట్టారట. 16 సంవత్సరాల నిర్మాణం తర్వాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కృతంలో ఉంటే మూడోది పర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొం డాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో కూడా అనేక దేవతావిగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనబడతాయి.

ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో కనిపిస్తుంది. ఓ గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనుప గొలుసులతో కడుతున్నట్లుగా ఉండే విగ్ర హం ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేం. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశైవుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశే షం. ఆలయం కింద భాగంలో నీళ్ళు నిల్వ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పట్నించో కొనసాగుతూ వస్తుందట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందట.

ఇక వినాయక ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పక్కర్లేదు. తొమ్మిది రోజులు పూనె చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిరహిస్తారు. రాజస్తానీ, మాల్వ మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్టు నడిసిస్తుందని చెబుతున్నారు ఇక్కడ అధికారులు.

 

Vinayaka Chavithi Festival Story Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూడు తొండాల విఘ్నేశుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.