నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం

Vinay-Sharma

తీహార్ : నిర్భయ దోషుల్లో ఒక్కడైనా వినయ్ శర్మ తీహార్ జైల్లో గురువారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీహార్ జైల్లో దోషులు ఉంటున్న జైలు గదిలో గోడకు తల బాదుకొని గాయపర్చుకున్నాడు. దీంతో వినయ్ తలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన జైలు అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే నిర్భయదోషులకు పటియాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ కూడా జారీ చేసింది. మార్చి 3 తేదీన ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరి తీయాలని ఉరి తీయాలని తిహార్‌ జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. నిర్భయదోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.

Vinay Sharma hurts himself in Tihar jail cell

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.